నవజాత శిశువును ఫ్లోరిడా వాగులో విసిరేసిన ప్రవాస భారతీయురాలి అరెస్ట్

Update: 2022-12-18 02:30 GMT
నాలుగేళ్ల క్రితం తన నవజాత శిశువును ఫ్లోరిడా సముద్ర తీరంలోని కాలువలోకి విసిరినందుకు భారతీయ-అమెరికన్ మహిళపై ఫస్ట్  డిగ్రీ హత్య కేసు నమోదైంది.

గురువారం అరెస్టయిన 29 ఏళ్ల ఆర్య సింగ్  తన నేరాన్ని అంగీకరించారు. " అప్పుడే పుట్టిన బిడ్డను ఏం చేయాలో తెలియలేదని.. అందుకే అలా కాలువలో విసిరేసినట్టు ఆమె తన నేరం అంగీకరించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

"బిడ్డ మృతదేహం జూన్ 1, 2018 న బోయిన్‌టన్ బీచ్ వాగులో తేలుతూ కనిపించింది. ఇది అందరి హృదయాన్ని కలిచివేసిందని పోలీసులు తెలిపారు. సదురు మహిళ ప్రసవించే వరకు తాను గర్భవతి అని కూడా గుర్తించలేదని ఆర్య సింగ్ పోలీసులకు తెలిపింది.

"ఆమెకు ఆ బిడ్డను ఏమి చేయాలో ఆమెకు తెలియదు. అందుకే కాలువలో పడేసి వదిలించుకోవాలని నిర్ణయించుకుంది" అని కేసును చేధించిన డిటెక్టివ్ బ్రిటనీ క్రిస్టోఫెల్ చెప్పారు.

సముద్రంలోకి విసిరివేయబడినప్పుడు శిశువు సజీవంగా ఉందని పోలీసులు కనుగొన్నారు. జాతీయ డీఎన్ఏ డేటాబేస్‌లో కనిపించినంత వరకు పరిశోధకులు చాలా సంవత్సరాలు కేసును పరిష్కరించలేకపోయారు.  శిశువు తండ్రి డీఎన్ఏ కోసం ముందుగా వెతికారు.

తండ్రి డిఎన్‌ఎ పరీక్ష చేశారు. ఆ సమయంలో అతడు డేటింగ్ చేస్తున్న మహిళ గురించి పరిశోధకులకు చెప్పాడు. ఆమె గర్భవతి అని తమతో చెప్పాడని, అయితే ఆమె బిడ్డను కనేందుకు మాత్రం సిద్ధంగా లేదని పోలీసుల విచారణలో తేలింది. అబార్షన్ చేసుకోవాలని కూడా భావించినట్టు తేలింది.

  పరిశోధకులు ఆర్య సింగ్‌కు చెందిన డీఎన్ఏను రహస్యంగా సేకరించారు. అనంతరం విచారణలో అసలు నిజం రాబట్టారు.

2018 జూన్‌లో బీచ్‌లో ఆఫ్ డ్యూటీ అగ్నిమాపక సిబ్బందికి మృతిచెందిన శిశువు కనిపించడంతో అధికారులు దీనిపై పంచనామా జరిపి తల్లి కోసం విచారణ జరపగా ఎట్టకేలకు ఇన్నిరోజులకు దొరికింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News