డిజిటల్ యుగంలో తుగ్లక్..కింగ్ కిమ్ జోంగ్ ఉన్

Update: 2015-11-28 07:43 GMT
అప్పుడెప్పుడో వందల ఏళ్ల కింద తుగ్లక్ అనే పిచ్చి రాజు ఉండటం.. అతగాడి నిర్ణయాలతో ప్రజలు నానా కష్టాలు పడటం తెలిసిందే. చివరకు పిచ్చి పనులు చేసే వారిని తుగ్లక్ అని పిలవటం చూస్తే.. ఆ రాజు చేసిన పనికిమాలిన పనులు ఎన్ని ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

తాజా డిజిటల్ యుగంలో ప్రపంచంలోని పలు రాజ్యాలు నామరూపాల్లేకుండా పోయినా.. కొన్ని చోట్ల మాత్రం వారి హవా నడుస్తుంది. అలా నడిచే కొన్ని దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ఈ దేశాన్ని పాలిస్తున్న ఆ దేశ రాజు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా సరికొత్త ఉత్తర్వులు పాస్ చేశారు. దేశంలోని మగాళ్ల తలపై వెంట్రుకల పొడవు 2 సెంటీమీటర్ల లోపే ఉండాలని డిసైడ్ చేశాడు. అంతేకాదు.. తలకు రెండు వైపులా నున్నగా షేవ్ చేసుకోవాలంటూ ఆర్డర్ పాస్ చేశాడు.

తాను పెట్టిన రూల్ ను ఎవరు పాటించకుండా వారికి ఫైన్లు తప్పవని బెదిరిస్తున్నాడు. తాజాగా పెట్టిన రూల్ ప్రకారం చూస్తే.. రాజు హెయిర్ కట్ మాదిరే.. దేశంలోని మగాళ్లంతా ఉండాలన్నట్లుగా కనిపించక మానదు. ఆ విషయాన్ని కూడా తన కొత్త రూల్ లో చెప్పకనే చెప్పేశారు. మగాళ్ల కు రెండు సెంటీమీటర్ల జట్టుకు మించి ఉండదకూదని రూల్ పెట్టిన రాజు.. ఆడోళ్ల విషయాన్నిమాత్రం వదిలేశాడు. ఇలాంటి తుగ్లక్ ల పాలనలో బతుకుతున్న ఉత్తర కొరియా ప్రజల అవస్థతుల గురించి ఆలోచిస్తేనే హడలిపోవటం ఖాయం కదూ.
Tags:    

Similar News