సీబీఐ లీక్ పై సుప్రీం ఆగ్రహం..

Update: 2018-11-21 07:24 GMT
ఇప్పటికే సీబీఐ పరువు దేశవ్యాప్తంగా పోయింది.. అవినీతి ఆరోపణలతో సీబీఐలోని ఉన్నతాధికారులు బజారున పడ్డారు. తాజాగా సీబీఐ డీఐజీ సోమవారం సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తూ కేంద్రమంత్రి హరిభాయ్ చౌదరి ఈ కేసులో లంచం తీసుకున్నారని.. జాతీయ భద్రత సలహాదారు ధోవల్ విచారణను అడ్డుకున్నారని.. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర మధ్యవర్తిగా వ్యవహరించారని బీజేపీ ప్రభుత్వ పరువును తీసేలా పిటీషన్ లో పేర్కొనడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

అయితే సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన సీబీఐ డీఐజీ మనీష్ సిన్హా ఆరోపణల వ్యాఖ్యలు ముందే వివిధ  వెబ్ సైట్లలో ప్రత్యక్షం కావడం.. మీడియాలో హైలెట్ కావడంపై తాజాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ విషయంలో వాదనలు తాము ఇప్పుడు వినమని.. ఆరోపణలు బయటకు ఎలా పొక్కాయని త్రిసభ్య ధర్మాసనం లాయర్లను నిలదీసింది.

సీబీఐ ప్రతిష్ట్ర ఇప్పటికే మసకబారిందని.. దాన్ని కాపాడాలని తాము చూస్తుంటే .. మీరు మాత్రం లీకులు ఇస్తూ ఇంకా సీబీఐ పరువు తీస్తున్నారనంటూ కోర్టు మండిపడింది.
    

Tags:    

Similar News