కేఏ పాల్ కు నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏ దేశాధ్యక్షుడు లైన్లోకి వస్తారో?

Update: 2019-08-19 11:11 GMT
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మత ప్రభోదకుడు కమ్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరికి దాదాపుగా తెలిసిన విషయమే. పసి పాపలు..చిన్నారులు మినహాయిస్తే.. పాల్ సాబ్ కు ఉన్న ఇమేజ్ పుణ్యమా అని.. ఆయన పేరు విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. వెంటనే రియాక్ట్ అవుతారు కూడా.

మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్ చేసిన హడావుడి ఎంతో తెలిసిందే. ఇంకేముంది?  ఏపీలో అధికారంలోకి రానున్నట్లుగా కూడా గొప్పలు చెప్పుకున్నారు. పార్టీ గెలవటం తర్వాత.. ఆయనకు గౌరవవంతమైన ఓట్లు వచ్చాయా? లేదా?  అన్నది ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆయన పోటీ చేసిన చోట ఆయనకు పడిన ఓట్లు చాలా తక్కువ. దీంతో ఆయన ఇమేజ్ ఎంతన్న విషయం ఈవీఎంల సాక్షిగా తేలిపోయింది. టీవీ స్క్రీన్ల మీద కనిపించినంతనే నవ్వులు పూయించే టాలెంట్ ఉన్న ఆయనకు తాజాగా కోర్టు ఒకటి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.

డోన్ట్ అండర్ ఎస్టిమేట్ మీ అన్నట్లుగా తన గురించి గొప్పలు చెప్పుకునే కేఏ పాల్.. ప్రపంచవ్యాప్తంగా తనకున్న పలుకుబడి గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ఇప్పటికే అలాంటి మాటల క్లిప్పింగులు యూట్యూబులో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిన కేఏ పాల్ హాజరు కాలేదు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన వారంతా హాజరయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన మహబూబ్ నగర్ న్యాయస్థానం కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. తనకు పలువురు దేశాధ్యక్షులు టచ్ లో ఉంటారని.. వారందరికి తరచూ తన సలహాలు తీసుకుంటారని చెప్పే కేఏ పాల్ కు.. తాజాగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన క్రమంలో ఏ దేశాధ్యక్షుడు జరిగిన ఉదంతంపై  రియాక్ట్ అవుతారేమో చూడాలి.
Tags:    

Similar News