ఇక నుండి వాహనాలకు కూడా నామినీ సౌకర్యం

Update: 2020-11-28 23:30 GMT
ఇప్పటి వరకు ఫిక్సెడ్ డిపాజిట్లకు, బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఉంటున్న నామినీ సౌకర్యాన్ని ఇక నుండి వాహనాలకు కూడా వర్తింపచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. వాహనాలకు నామినీ సౌకర్యం కల్పించటమన్నది వినూత్నమైన ఆలోచన అనే చెప్పాలి. ఇప్పటివరకు ఉన్న పద్దతి ఏమిటంటే వాహనం కొన్నపుడు యజమాని తన పేరుమీదే రిజిస్టర్ చేయించుకుంటారు. ఏ కారణం వల్ల అయినా యజమాని చనిపోతే సదరు వాహనాన్ని వారసులు తమ పేర్లతో బదిలీ చేయించుకవటం తలకు మించిన పని అన్న విషయం అందరికీ తెలిసిందే.

యజమాని చనిపోయినట్లు ధృవీకరణ సర్టిఫికేట్ తో పాటు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయకతప్పదు. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా మేజిస్ట్రేట్ దగ్గర నుండి మాత్రమే తీసుకోవాలి. ఇన్ని ధృవీకరణ పత్రాలు అందచేసిన తర్వాత సదరు వాహానాన్ని తన పేరు మీద వారసులు మార్చుకోవాలంటే  కొంతకాలం ఆగాల్సిందే. కానీ కొత్తగా సవరించబోతున్న మోటారు వాహనాల చట్టంలో ఇటువంటి అనేక సమస్యలకు పరిష్కారం ఉండబోతోంది.

వాహనాన్ని కొనుగోలు చేసేటపుడే సదరు యజమాని రిజిస్ట్రేషన్ సమయంలో అందించే దరఖాస్తులో నామినేషన్ పేరును ప్రతిపాదించే సౌకర్యాన్ని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అంటే దరఖాస్తులో నామినీ అనే కాలమ్ ను కొత్తగా చేర్చబోతోంది. దీని ప్రకారం నామినీ పేరును గనుక యజమాని ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఏ కారణం వల్లనైనా యజమాని చనిపోతే సంబంధింత రవాణా కార్యాలయంలో (ఆర్టీఏ) కేవలం యజమాని డెత్ సర్టిఫికేట్ అందిస్తే సరిపోతుంది. మంచి ఆలోచన చూద్దాం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందో.
Tags:    

Similar News