ప్రకృతి కోపాన్ని ఇక్కడ కళ్లారా చూడండి..

Update: 2018-05-24 07:29 GMT
ఈ ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. వాటిని సద్వినియోగం చేసుకొని మనం హాయిగా బతికేస్తున్నాం. కానీ మనిషి తన అవసరాలకు మించి వాడేయడంతోనే ప్రకృతికి కోపం వస్తోంది. అందుకే అప్పుడప్పుడు భూకంపాలు, సునామీలంటూ విరుచుకుపడుతూ తన కోపాన్ని వెళ్లగక్కుతోంది. మనుషును చంపేస్తోంది. ఇంత చేస్తున్న ప్రకృతిని కాపాడుకుందామనే స్పృహే ఈ మానవజాతికి రాకపోవడం శోచనీయమే మరి..

గడిచిన 50 ఏళ్లతో పోలిస్తే వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చాయి. ఎండలు , వానలు, చలి పెరిగిపోయాయి. ప్రకృతి బీభత్సాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తర - దక్షిణ అమెరికాలో వచ్చిన వర్షం - ఉరుములు మెరుపులను జీవోఈఎస్ -17 అనే ఉపగ్రహం వీడియో తీసింది. ఈ నెల 9న ఈ వీడియోను ఉపగ్రహం రికార్డు చేసినట్టు ఉంది. తాజాగా జాతీయ సముద్ర - వాతావరణ పారిపాలక సంస్థ (ఎస్ ఓఏఏ) విడుదల చేసిన ఈ వీడియోలో ప్రకృతి ఎంత బీభత్సం సృష్టిస్తుందో తేటతెల్లమైంది.

ఉత్తర, దక్షిణ అమెరికాలో ఉరుములు - మెరుపులతో భారీ వర్సాలు కురిశాయి. ఆ మెరుపుల తీవ్రత వందల కిలోమీటర్ల ల దూరంలో ఉన్న ఉపగ్రహానికి కూడా కనిపించేంత భారీస్థాయిలో ఉన్నాయి. ఆ భారీ మెరుపుల తీవ్రతను వీడియోలో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

ఎస్ ఓఏఏ విడుదల చేసిన   వీడియో ఇదే..

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News