మెట్రో లో నో టోకెన్.. ఓన్లీ కార్డు మాత్రమేనట!
వచ్చే నెల ఏడో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో రైళ్లు పరుగులు తీసేందుకు వీలుగా కేంద్రం ఓకే చెప్పింది. అయితే.. కేంద్రం ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వాలు తమకున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే.. మెట్రో రైళ్లు నడపటం.. నడపకపోవటం అనేది ఆయా రాష్ట్రాల చేతుల్లో ఉందని చెప్పాలి. దేశంలోని అన్ని మెట్రోలకు మార్గదర్శకంగా నిలిచే ఢిల్లీ మెట్రో.. తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ఇప్పటివరకు ఏ మెట్రో రైళ్లలో ప్రయాణించాలంటే.. స్మార్ట్ కార్డులు.. లేదంటే టోకెన్ సిస్టం ఉండేది. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా కేవలం స్మార్ట్ కార్డు విధానాన్ని మాత్రమే అమలు చేస్తారు. స్టేషన్లలో జారీ చేసే టోకెన్లకు చెక్ పెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో నేరుగా కాంటాక్టు కాకుండా ఉండేందుకు వీలుగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా లోకెన్లను చెల్లుచీటి ఇవ్వనున్నారు.
ఎందుకంటే.. టోకెన్ల జారీ వేళ.. కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉండటమేనని చెబుతున్నారు. ఇక.. మెట్రో స్టేషన్ల ఎంట్రీ పాయింట్లలో శానిటైజర్ డిస్పెన్సర్స్.. స్క్రీనింగ్ యంత్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు.. మెట్రోలో జర్నీ చేయాలంటే కొన్ని నిబంధనల్ని తప్పనసరిగా పాటించాలి. లేకుంటే.. సమస్యలు ఎదురుకావటం ఖాయం. భారీగా ఫైన్లు వేసే అవకాశం ఉంది. ఇంతకీ ఆ రూల్స్ ఏమంటే..
- మెట్రో స్టేషన్ల ఎంట్రీ పాయింట్ల వద్ద శానిటైజర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేస్తారు.
- ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ప్రయాణానికి అనుమతిస్తారు.
- శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణానికి అనుమతించరు.
- గతంలో మాదిరి టికెట్ల కోసం టోకెన్ల జారీ ఉండదు.
- ప్రయాణికులు తప్పనిసరిగా స్మార్ట్‌కార్డులు, డిజిటల్ పద్ధతులు వాడాల్సిందే
- మెట్రో కార్డులను రీచార్జి సైతం డిజిటల్ మాధ్యమంలోనే చేసుకోవాల్సి ఉంటుంది.
- కౌంటర్లు తెరిచే ఉంటాయి. స్మార్ట్‌కార్డులు, మెట్రోకార్డులను కౌంటర్లలో కొనుగోలు చేయొచ్చు.
- మెట్రో ప్రాంగణంలో, కోచ్‌లలో మాస్క్ ధరించడం తప్పనిసరి.
- భౌతక దూరం నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పక పాటించాల్సిందే.
- సీటింగ్‌కు సీటింగ్‌కు మధ్య మీటర్ దూరం తప్పనిసరి.
- మెట్రోలోని ఎయిర్ కండిషనర్లను క్రమం తప్పకుండా నియంత్రిస్తారు.
- మెట్రో స్టేషన్లు, ప్లాట్‌ఫాంలు, మెట్రో కోచ్‌లలో రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
- మెట్రో సిబ్బంది, పోలీసులు, పౌర రక్షణ వలంటీర్లను రద్దీ నియంత్రణకు వినియోగిస్తారు
- మాస్కులు ధరించడం తప్పనిసరి. మాస్కులు ధరించని వారికి జరిమానా తప్పదు
- కంటైన్‌మెంట్ జోన్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండవు. క్లోజ్‌డ్ స్టేషన్లలో రైలు ఆగదు.