• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డామిట్.. ‘బండ్ల’ కథ అడ్డం...

డామిట్.. ‘బండ్ల’ కథ అడ్డం తిరిగింది!

By - Tupaki Desk
Update: 2018-10-15 08:55 GMT
ఇటీవల కాంగ్రెస్ చేరిన బండ్ల గణేష్ కు ఊహించని దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడదామన్న ఆయన ఊహాలకు అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆయన అనుకున్న షాద్ నగర్ టిక్కెట్టు ఇంకొకరు తన్నుకుపోయారు.   ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పెద్దల వద్ద అసహనం వ్యక్తం చేశారట.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన బండ్ల గణేష్, ఆ తరువాత నిర్మాతగా మారాడు. పలు చిత్రాలకు నిర్మించాడు. రాజకీయాల్లోకి చేరి శాసన సభ్యుడు కావాలన్నది ఆయన కల. పవన్ కల్యాణ్ తన దేవుడిగా అభివర్ణించిన ఆయన జనసేనలో చేరతారని అంతా అనుకున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరి పోయారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ చేత కండువా కప్పించుకొని వచ్చారు. ఆ సమయంలో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని కోరి వచ్చారట.

ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో భరత్ అనే నేను సినిమాను పోలినట్లు బండ్ల గణేష్ అనే నేను అని మొదలుపెట్టారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కూటమిదే విజయమని తేల్చిచెప్పారు. కనీసం 104 స్థానాల్లో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కూడా షాద్ నగర్ లేదా జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తానని అన్నారు. ఆ వీడియోను నెటిజన్లు కూడా బాగా ఎంజాయ్ చేశారు.

కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం బండ్ల గణేష్ ఎంతో ఆశించిన షాద్ నగర్ టిక్కెట్ ను చౌలపల్లి ప్రతాప్ రెడ్డికి కేటాయించింది. ఈయన ఇక్కడ బలమైన నాయకుడు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ పై వచ్చిన విముఖత కారణంగా ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ గెలుపొందారు. ఈ సారి ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో షాద్ నగర్ నుంచి పోటీ చేసేందుకు ప్రతాప్ రెడ్డి ఉన్నారు.  టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతాప్ రెడ్డే బలమైన నాయకుడిగా భావించిందట.

ఈ క్రమంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న బండ్ల గణేష్ కు ఆశాభంగం కలిగింది. ఈయనను ఎక్కడ నుంచి పోటీ చేయించాలన్న మీమాంసలో కాంగ్రెస్ పెద్దలు పడిపోయారట. అసలు బండ్లకు టిక్కెట్ దక్కే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయట. జూబ్లిహిల్స్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో ఊపుమీదున్నాడు. గడిచిన సారి పోటీచేసి ఓడిపోయిన ఆయనకే ఈసారి టిక్కెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ లో లేదా సెటిలర్స్ ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గం నుంచి బండ్ల గణేష్ ను పోటీ చేయించే యోచనలో కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారట. మరి గణేష్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేక భవిష్యత్తు ప్రణాళిక ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. అంత తాను అనుకున్నట్లే జరుగుతుందని భావించినా, కథ ఇలా అడ్డం తిరుగడంతో ఆయన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Tags:    
  • MLA Ticket 
  • Bandla Ganesh 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS