కరోనాతో ఊపిరితిత్తుల సమస్యలు రావట..
కోవిడ్ మహమ్మారి సోకిన వారిలో చాలామంది లంగ్స్ సమస్యలు ఎదురుకున్నారు. లంగ్స్ పైనే అధిక ఎఫెక్టు చూపుతుందని డాక్టర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రెస్పిరేటరీ విభాగానికి చెందిన కొందరు దీనిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో కోవిడ్ సోకిన యువత లో లంగ్స్ దెబ్బతినే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేలిందని పేర్కన్నారు. కోవిడ్ రాకముందు ఊపిరితిత్తులు ఎట్లా పనిచేస్తున్నాయో కోవిడ్ బారినపడి కోలుకున్న తరువాత అట్లా పనిచేస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ స్టడీ కి చెందిన పరిశోధన కాగితాన్ని ఇటీవల యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌కు అందించారు.
ఈ అధ్యయనం ప్రకారం యువతలో కరోనా సోకితే వారి లంగ్స్ పాణితురుపై ఎటువంటి ప్రభావం పడదని చెప్పారు. ఆస్తమా వ్యాధి గ్రస్తుల లంగ్స్ పై కూడా పెద్దగా ప్రభువం చూపదని స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త డా. ఐడా మాగెన్ సెన్ చెప్పారు. కోవిడ్ సోకిన టైంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల పనితీరులో మార్పు లేదని తెలిపారు. చిన్నారుల్లో కూడా ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రతికూల ఎఫెక్ట్ ఉండదని మరో కొత్త అధ్యయనంలో వెల్లడించారు. చిన్నారులు, వతీయువకుల లంగ్స్‌పై కోవిడ్ మహమ్మారి ప్రభావం ఏమాత్రం ఉండదని వివరించారు.
స్టాక్‌హోమ్‌లో 1994-1996 మధ్య జన్మించిన వారిపై ఓ అధ్యయనం చేశారు. సగటు వయసు 22 సంవత్సరాల వారిపై ఈ పరిశోధనలు చేయగా అందరిలోను లంగ్స్ యొక్క పనితీరు ఇంతకుముందు లాగానే ఉందని తేల్చారు. కాగా ఈ స్టడీ కరోనాకు ముందే ప్రారంభమైంది. 2016 నుంచి 2019 వరకు పరిశోధన చేశారు. వీరిపై రకరకాల టెస్టులు చేశారు. ఆ తర్వాత 2020 అక్టోబర్ నుంచి 2021 మే నెల వరకు 661 మందిపై రీ సెర్చ్ చేశారు. ఈ పరిశోధనల్లో లంగ్స్ పై ప్రభావం పడలేదని లేల్చారు. 178 మంది రక్తంలో సార్స్ కొవ్ – 2 వ్యతిరేక యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. అయితే ఊపిరి తిత్తుల సమస్యలు ఏం లేవని చెప్పారు.
కరోనా వచ్చిన తరువాత చాలా మందికి మొదట్లో అందరికీ ఊపిరితిత్తుల సమస్యలు వచ్చయి. కానీ కోలుకున్న తరువాత అలాంటి ప్రభావం ఎం లేదని చెప్పారు. ఈ కరోనా సెకెండ్ వేవ్ సమయంలో భారత దేశంలోని చాలా ఆస్పత్రుల్లో చాలా మంది రోగులు ఊపిరితిత్తులు పాడయి చనిపోయారు. కొద్ది మందికి ఊపిరి తిత్తుల మార్పిడి జరిగినప్పటికీ మిగితా వారు మాత్రం చనిపోయారు. అయితే కరోనా వచ్చిన వారిలో ఊపిరితిత్తులతో పాటు, కిడ్ని, గుండె, లివర్ వంటి అవయవాల్లోనూ సమస్యలు మొదలయ్యాయి.
దాదాపు అన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అధ్యయనం ఊపిరితిత్తులపై చేసిన అధ్యయనం కొంత ఉపశమనం కలిగించింది. కానీ కరోనా రాకుండా మాత్రం జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగేందుకు వ్యాయమాలు చేయాలని వివరించారు. కరోనా రాకుండా వ్యాక్సిన్‌లు వేసుకోవాలని పేర్కొంది.