• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నోట్ల ప్రింటింగ్ కు...

నోట్ల ప్రింటింగ్ కు ప్రాబ్లం లేదంట కానీ..

By - Tupaki Desk
Update: 2016-11-23 09:45 GMT
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే. ఓపక్క అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా.. సామాన్యుల పరిస్థితి మాత్రం ఏమాత్రం మార్పు లేని పరిస్థితి. క్యాలెండర్లో తేదీలు మారుతున్నా.. ఇప్పటివరకూ బ్యాంకుల వద్దా.. ఏటీఎంల వద్దా క్యూ బారుల్లో మాత్రం మార్పులు రావటం లేదు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ తీసుకున్న రద్దు నిర్ణయంపై పలువురు కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ తరహా ఫిర్యాదుల్ని విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా కేంద్రంపై కాస్తంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసి.. రద్దుపై వస్తున్న పిటీషన్లను విచారణకు ఓకే చెబుతోంది. తాజాగా.. ఈ అంశంపై దాఖలైన పిటీషన్లపై వాదనలు మొదలయ్యాయి. రద్దుపై కేంద్రం తరఫు వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. కేంద్రం తీసుకున్న చర్యల్ని ఏకరువు పెట్టారు.

నోట్ల రద్దు నిర్ణయం అనంతరం కేంద్రం చేపట్టిన చర్యల గురించి ఆయన వివరించే ప్రయత్నం  చేశారు నోట్ల కొరత తీవ్రంగా ఉందన్న అంశంపైనా ఆయన సమాదానం ఇచ్చారు. ఈ సందర్భంగా నోట్ల కొరతకు అసలు కారణాన్ని ఆయన చెప్పటం గమనార్హం. నోట్లను ముద్రించే విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని .. ఆ తీరులో వస్తున్న వార్తల్లో నిజమే లేదని చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంకు..  ప్రభుత్వ ముద్రణాలయాలు ప్రజలకు అవసరమైన కరెన్సీని ముద్రిస్తున్నాయని.. సమస్య అంతా కరెన్సీని దేశ వ్యాప్తంగా పంపించే విషయంలోనే ఇబ్బంది ఎదురువుతుందని వెల్లడించారు.

ముద్రించిన కరెన్సీని.. బ్యాంకులు.. పోస్టాఫీసులకు రవాణా చేయటంలోనే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కేంద్రం తరఫు అటార్నీ జనరల్ అసలు విషయాన్ని వెల్లడించారు. అయితే.. ఆలస్యం జరగకుండా ఉండేలా.. కొత్త నోట్లను తరలించేందుకు చర్యలు చేపట్టామని.. నోట్ల కొరతపై ప్రజలు గాబరా పడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ నోట్ల కొరతపై ప్రభుత్వం కానీ.. పాలకులు కానీ సంతృప్తికరమైన సమాధానం చెప్పని పరిస్థితుల్లో.. అసలు విషయం ఏమిటన్నది సుప్రీంకోర్టు విచారణ పుణ్యమా అని బయటకు వచ్చిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Cash 
  • Supreme Court 
  • Telugu News 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS