బీహార్ లో మోదీకి నో చాన్స్.. ఇద్దరు బీజేపీ డిప్యూటీ సీఎంలు
బీహార్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించింది బీజేపీ.. తక్కువ సీట్లు సాధించినా కూడా మిత్రభేదం రాకుండా మళ్లీ జేడీయూ అధినేత నితీష్ కుమార్ నే సీఎం పీఠంపై కూర్చుండబెట్టింది. బీహార్ సీఎంగా నితీష్ వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం నిర్వహించిన సభలో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ ను ఎన్నుకున్నారు. అయితే అనూహ్యంగా బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ మోడీకి ఈసారి డిప్యూటీ సీఎం పదవి దక్కలేదు. బీహార్ బీజేపీ అధ్యక్షుడైన సుశీల్ ఇప్పటికే రెండు సార్లు డిప్యూటీ సీఎంగా చేశారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరికి డిప్యూటీ సీఎం పోస్టులు ఇచ్చారు.ఒక మహిళను బీజేపీ డిప్యూటీ సీఎం చేస్తోంది.
డిప్యూటీ సీఎం, కీలక శాఖలు సహా స్పీకర్ పదవులను బీజేపీ చేజిక్కించుకోవడం విశేషం. ఈసారి ఇద్దరికి డిప్యూటీ సీఎం పోస్టులు కట్టబెట్టారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం, బీజేపీ బీహార్ అధ్యక్షుడు సుశీల్ మోదీకి కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. బీజేపీ నేతలు, నితీష్ ఆదివారం రాత్రి సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.
బీహార్ డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ కు ఎక్కువ అనుభవం ఉంది. 2005 నుంచి ఆయనే బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈసారి మాత్రం ఆయన కాలేకపోయారు.
బీహార్ డిప్యూటీ సీఎంలుగా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలు తారాకిశోర్ ప్రసాద్, రేణూ దేవిలు ఖరారయ్యాయి. బీజేపీ శాసనసభాపక్ష నేతగా కిశోర్ ప్రసాద్ ను నియమించుకున్నారు. రేణుదేవి, తారకిషోర్ లు ఇప్పటివరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
బీహార్ లో గెలుపునకు వెనుకబడిన వర్గాలు, మహిళల ఓట్లు కీలకంగా మారాయి. అందుకే తారా కిషోర్, రేణుదేవిలకు బీజేపీ అగ్రతాంబూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.
బీహార్ డిప్యూటీ సీఎం పదవి దక్కనందుకు సుశీల్ కుమార్ మోడీ స్పందించారు. 40 ఏళ్లుగా పదవుల్లో కొనసాగుతున్నానని.. బీజేపీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. సహకరించిన పెద్దలకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.