అర్ధరాత్రి ఒంటరి మహిళపై దారుణం.. 12 మంది సామూహిక అత్యాచారం
నిజామాబాద్ లో సోమవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ఓ మహిళపై 12 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న మహిళను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఎడపల్లికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బాధిత మహిళకు తోడుగా ఆమె చెల్లెలు ఆస్పత్రిలో ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె సొంత పని మీద నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్ళింది. అక్కడ ఒంటరిగా తిరుగుతున్న ఆమెను విక్కీ అనే యువకుడు గమనించాడు. దగ్గరికి వెళ్లి మాట కలిపాడు. తన అక్కకు ప్రమాదం జరిగిందని.. ఇక్కడి ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని యువకుడితో చెప్పింది. దీంతో అతడు తన వెంట వస్తే చికిత్సకు సహాయం ఇప్పిస్తానని నమ్మబలికాడు.
ఆమెను కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ ప్రాంతానికి తీసుకు పోయాడు. రెవిన్యూ భవన్ లోని ఒక ఖాళీ గదిలోకి తీసుకెళ్లి.. బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువకుడు అంతటితో ఆగకుండా తన స్నేహితులందరికీ విషయం చెప్పి వారిని కూడా పిలిపించాడు. పదకొండు మంది యువకులు ఆ ప్రాంతానికి చేరుకుని ఒకరి తర్వాత మరొకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాసేపటికి అటుగా పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడాన్ని గుర్తించి యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులు ప్రశ్నించగా.. జరిగిన దారుణం గురించి ఆమె వివరించింది. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి చెప్పిన వివరాలతో పోలీసులు గాలించి విక్కీ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
అతడిది హమాల్వాడీ అని, పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఉంటాడని పోలీసులు తెలిపారు.8 మంది అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని, వన్ టౌన్ ఎస్ హెచ్వో ఆంజనేయులు తెలిపారు. నిందితుల్లో కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి మహిళపై 12 మంది దారుణానికి ఒడిగట్టడంతో ఈ ఘటన నిజామాబాద్లో సంచలనంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.