బేరం కుదిరింది.. బీజేపీ ప్రతిపాదనకు తలొగ్గిన నితీశ్
బీహార్ ఎన్నికల సందడి మొదలైంది. పోటీలు, పొత్తులు, బేరసారాలు, అలకలు సీట్ల ఎంపిక తదితరాలకు సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయి.కాగా బీహార్ ఎన్నికల వ్యవహారం లో బీజేపీ, జనతాదళ్ (యూ) మధ్య పొత్తు కుదిరింది. మీకన్నినా..మాకిన్నేనా అంటూ సాగుతూ వచ్చిన వ్యవహారానికి చిక్కు ముడి వీడింది. గత కొంత కాలంగా ఉన్న సీట్ల పంచాయితీకి తెర పడింది. బీజేపీ కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు సీఎం నితీశ్‌కుమార్ ఒప్పుకోవడంతో చిక్కుముడి వీడింది. బీజేపీ అధిష్ఠానం చివరకు పంతం నెగ్గించుకున్నది. మొత్తం 243 స్థానాలలో బీజేపీ, జేడీయూ చెరి సగం స్థానాల్లో పోటీచేయనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు వెల్లడించనున్నారు.
జేడీయూ వాటా లో ఉన్న 122 సీట్లలో అయిదు స్థానాలను జితిన్ రాం మాంఝి నేతృత్వంలోని హెచ్‌ఎమ్‌కు వెళ్లనుండగా, బీజేపీకి చెందిన 121 సీట్లలో కొన్ని ముఖేష్ నిషాద్ కు చెందిన వికాషీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)కు ఇవ్వనున్నారు. ఇప్పటికే రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏను తప్పుకున్నది. తమ పార్టీ కేవలం జేడీయూ మీదనే పోటీచేస్తుందని బీజేపీ వ్యతిరేకంగా కాదని రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎల్జేపీ 42 సీట్లు కోరితే కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తానని బీజేపీ చెప్పడంతో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బహిరంగలేఖను మీడియాకు విడుదల చేశారు. ఏది ఏమైనా ప్రస్తుతం బీహార్ లో ఎన్నికల వేడి రాజుకున్నది. సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రావడం తో ఇక ప్రచారం ముమ్మరం కానున్నది.