మోడీ - చౌక్సీల ఆస్తుల వేలం నుండి అణా పైసా కూడా రాలేదు: పిఎన్ బి!

Update: 2020-10-23 10:10 GMT
నిరవ్ మోడీ ,మోహిల్ చౌక్సీ .. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి కొన్ని వేలకోట్ల రూపాయల లోన్స్ తీసుకోని ,కట్టకుండా  మోసం చేసి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తులు. వీరి ఆస్తుల వేలం నుంచి బ్యాంకుకు ఎటువంటి డబ్బు  జమకాలేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది.

సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు బ్యాంకు సమాధానం ఇచ్చింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మరియు అతని మామ మెహుల్ చోక్సీలు సంయుక్తంగా రూ. 15,423.39 కోట్లు  మోసం చేశారు. మోడీని ఇప్పటికే లండన్ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని భారత్ కు అప్పగించే ప్రక్రియ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. నిరవ్ మోడీని భారత్ కి అప్పగించాలని కోరుతున్నారు. కాగా, నీరవ్ మోడీ నుంచి రూ.7,409.07 కోట్లు, మెహుల్ చోక్సీ నుంచి రూ.8,014.32 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. సామాజిక కార్యకర్త జితేంద్ర ఖడ్జూ సమాచార హక్కు చట్టం కింది అడిగిన ప్రశ్నకు బ్యాంకు ఈసమాచారం అందించింది.

కాగా, బకాయిల రికవరీపై అడిగిన ప్రశ్నకు బ్యాంకు ఏమి చెప్పలేదు. వీరిద్దరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను వెల్లడించటానికి కూడా బ్యాంకు నిరాకరించింది. ఈ వివరాలు ఇస్తే ఇది ఆర్టీఐ చట్టం, 2005 యొక్క U / S 8 (1) (h) కింద నేరస్తుల విచారణకు భంగం వాటిల్లుతుందని పేర్కోంది. ఈ కేసులు వాదించటానికి అయిన ఖర్చులు వివరాలు సమర్పించాలని మరో ఆర్టీఐ దరఖాస్తు దాఖలైనప్పటికీ  దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తుందని సమాచారం ఇవ్వలేమని బ్యాంకు తెలిపింది. ఆర్టీఐలో వచ్చిన దరఖాస్తులు వాటిపై ఇచ్చిన సమాధానాలపై స్పందించేందుకు బ్యాంకు అధికారులు ఇష్టపడలేదు.
Tags:    

Similar News