పాక్ పై మోదీ ట్వీట్.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్..!

Update: 2022-08-30 15:01 GMT
పాకిస్తాన్ లో వరద బీభత్సం సృష్టిస్తోంది. గత మూడు నెలలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. 1100 మందికి పైగా మరణించగా.. 10 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వరదలు రావడంతో ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఎమర్జెన్సీని ప్రకటించారు పాక్​ ప్రధాని షెహ్​ బాజ్​ షరీఫ్​. వరదల కారణంగా పాకిస్తాన్ జనాభాలో ఏడో వంతు ప్రజలు సంక్షోభం కారణంగా వేరే ప్రాంతాలను తరలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

దేశంలో నిధుల కొరత ఏర్పడిన తరుణంలో అత్యవసర సహాయం కోసం ఇతర దేశాల సహాయాన్ని కోరుతోంది పాకిస్తాన్. పొరుగు దేశంలోని పరిస్థితి పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రకృతి విపత్తుతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

"పాకిస్థాన్​ లో వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా సంభవించిన విధ్వంసం చూసి చాలా బాధపడ్డాను. బాధితులు, గాయపడిన వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తీయజేస్తున్నాను. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రభావితమైన వారందరూ త్వరగా సాధారణ స్థితిని చేరాలని ప్రార్థిస్తున్నాను" అని నరేంద్ర మోదీ ట్వీట్​ లో పేర్కొన్నారు.

పాకిస్తాన్ శత్రు దేశం అయినప్పటికీ.. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలపై మానవత్వంతో ట్వీట్ చేసిన భారత ప్రధానీని అందరూ ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో దీనిపై భిన్నంగా రియాక్ట్ అయిన వారు కూడా ఉన్నారు. లేటెస్టుగా మోడీ ట్వీట్ పై బాలీవుడ్ నిర్మాత, నటుడు నిఖిల్ ద్వివేది కాస్త వ్యగ్యంగా స్పందించారు.

''సర్.. ఇది చాలా మంచి ట్వీట్. మీరు చాలా మంచి దేశాధినేత. పాకిస్తాన్ శత్రు దేశం అయినప్పటికీ ఇలాంటి సమయాల్లో నిజమైన నాయకులు శత్రుత్వం కంటే మానవత్వానికే విలువిస్తారు. అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ - సైఫ్ అలీఖాన్ లేదా ఇతరులు ఎవరైనా కూడా స్వేచ్ఛగా అదే ట్వీట్ చేసే వాతావరణం ఇక్కడ నెలకొనాలి'' అని నిఖిల్ ద్వివేది రాసుకొచ్చారు.

నిఖిల్ పరోక్షంగా నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ.. ఇండియాలో పరిస్థితులు ఆ విధంగా లేవనే అర్థంలో ట్వీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు మాత్రం మండిపడుతున్నారు.

''కరెక్ట్ సార్. భారతదేశంలో స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం లేదు. ఈ స్టేట్మెంట్ ను ఎవరైనా ఖాన్స్ ఇచ్చి ఉంటే, సోషల్ మీడియాలో తమ జీవితాలను 'త్యాగం' చేసిన ప్రతి స్వచ్ఛమైన దేశప్రేమి వారిని విమర్శించడం స్టార్ట్ చేసేవారు. వాళ్ళని 'పాకిస్థానీ' అని పిలిచేవారు'' అని ఓ నెటీజన్ ట్వీట్ పెట్టాడు.

''అవును. వారు మొదట భారతీయ ప్రజల కోసం ట్వీట్ చేయనివ్వండి. ఆపై పాకిస్తాన్ గురించి మాట్లాడనివ్వండి. మీరు కూడా ఇలా సెలెక్టివ్ ట్వీట్ చేయడం ఎందుకు.!'' అని మరో నెటీజన్ స్పందించారు. ''వారు అస్సాం - కేరళ - ఉత్తరాఖండ్ వరదలప్పుడు అలా చేసి ఉంటే.. ఇప్పుడు కూడా చేయవచ్చు'' అని మరో వ్యక్తి పేర్కొన్నాడు.

''వారు ఖచ్చితంగా చేయగలరా? వారు తమ సొంత దేశ విపత్తు గురించి కూడా ట్వీట్ చేయాలి. బహిరంగంగా ఉగ్రవాదాన్ని కూడా కించపరచాలి. వారు సాధించిన దానికి ఈ దేశానికి కృతజ్ఞతలు తెలపాలి. దేశానికి శత్రువు ఎవరో తెలుసుకోవాలి'' అని ఓ నెటీజన్ అభిప్రాయ పడ్డాడు.

''అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ - సైఫ్ అలీఖాన్ ఇలాంటి సమస్యలపై ట్వీట్ చేయడానికి వీల్లేదని లేదా అలా చేయడానికి భయపడుతున్నారని మీకు చెప్పారా? చంచాగిరి చేయాలంటే ప్రైవేట్ గా చేయండి.. ఇలా పబ్లిక్ గా ఎందుకు?'' అని నిఖిల్ ద్వివేది ట్వీట్ పై మరో నెటిజన్ స్పందించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News