పవన్ ఒక్క నిర్ణయం.. వందల మందిని కదిలిస్తుందా.. డేంజర్ అవుతుందా...!
అవును.. జనసేన అధినేత తీసుకునే నిర్ణయం.. ఆ పార్టీని బలోపేతం చేస్తుంది. లేకపోతే.. ప్రమాదంలో పడేయనుందనే చర్చ సాగుతోంది. ఈ విషయం లో మేధావులు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ``జనసేన పుంజుకుంటున్న పార్టీ. ఈ దశలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ఇబ్బందులు తప్పవు `` అని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఏ పార్టీలో అయినా అధినేత తీసుకునే నిర్ణయం.. వేసే అడుగులపైనే నాయకత్వం ఆశలు పెట్టుకుంటుంది. వైసీపీలోనూ అదే జరిగింది. అధినేత జగన్ బలంగా నిలబడి ఎందుకు అధికారంలోకి రాలేమో చూద్దామంటూ పాదయాత్ర చేశారు.
ఫలితంగా క్షేత్రస్థాయిలో నాయకత్వం పుంజుకుని పార్టీని అధికారంలోకి వచ్చేందుకు, తెచ్చేందుకు విశేషంగా పనిచేశారు. ఇదేస్థాయిలో పవన్ నిలబడాలనేది జనసేన నేతల అభిమతం కూడా. పైగా.. తాను పొత్తు పెట్టుకుంటున్నారో లేదో కూడా ఆయన క్లారిటీ ఇవ్వాలి.
లేకపోతే.. ఒంటరిగానే బరిలోకి దిగుతారా? దిగితే ఏవిధంగా పార్టీని ముందుకు నడిపిస్తారనే విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇది కనుక వచ్చే రెండు మూడు మాసాల్లో తేలిపోతే.. వందల మంది నాయకులు పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
ఉదాహరణకు బీజేపీ నుంచి ఒక కీలక నాయకుడు బయటకు రావాలని చూశారు. ఇటీవల ఆయన బీజేపీ రాష్ట్ర చీఫ్‌పైనా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారిపోవడం ఖాయమనే చర్చసాగింది. వెంటనే ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. తన మనసులోని ఉద్దేశాన్ని వారికి చెప్పారు.కానీ, వారు మాత్రం దశ దిశలేని పార్టీలోకి వెళ్లి.. ఏం చేస్తాం! అని కుండబద్దలు కొట్టారు. ఇదంతా జనసేన గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో సదరు నేత మౌనంగా ఉన్నారు.
ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వీరికితోడు మేధావులు.. ఉద్యోగులు కూడా రెడీగా ఉన్నారు. అంతో ఇంతో నిర్మాణాత్మక రాజకీయాలు కోరుకునే వారు ఆదినుంచికూడా పవన్‌వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో జేడీ లక్ష్మీనారాయణ వచ్చినా.. మరొకరు వచ్చినా వారి ఉద్దేశం ఇదే.
అయితే.. ఈ నిర్మాణాత్మకమే లేకపోవడం ఇప్పుడు జనసేనకు శాపంగా మారింది. మరి ఈ విషయంలో ఇప్పటికైనా పవన్ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి. లేకపోతే.. ఎన్నికలకు ముందు ప్రకటించే ఏ నిర్ణయమైనా.. పార్టీని బలోపేతం చేయకపోగా నాయకుడిగా ఆయనకు కూడా ఇమేజ్ తగ్గిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.