ప్రధానిసరే.. కేసీఆర్ అంటే కూడా ఇంత జడుపా...?
తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు నిన్న మొన్నటి వరకు ఒక మాట అనేవారు. ముఖ్యంగా ఏపీలో అయితే.. ఈ మాట ఇప్పటికీ వినిపిస్తూనేఉంటుంది. ఏ కామ్రెడ్ మైకు ముందుకు వచ్చినా.. టీడీపీ అదినేత చంద్రబాబు, వైసీపీ అధినేత సీఎం జగన్‌ను వారు టార్గెట్ చేస్తున్నారు. అదేమంటే.. వీరిద్దరూ కూడా.. ప్రధాని మోడీ ముందు మాట్లడలేరని.. ఆయన అంటే.. చలి జ్వరమని కూడా కామెంట్లు చేస్తుంటారు.
ఇది నిజమేనని అనిపిస్తుంది. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాపై..గతంలో చంద్రబాబు యుద్ధం చేస్తున్నానని చెప్పి..త ర్వాత.. సైలెంట్అయ్యారు. ఇక, ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతగా జగన్.. 25 మంది ఎంపీలను ఇస్తే.. ప్రత్యేక హోదా తెస్తానన్నారు. కానీ, తర్వాత..చేతులు ఎత్తేశారు.కనీసం.. ప్రధాని ఏపీకి వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించడం లేదు.
పన్నెత్తి ఒక్కమాట కూడా అనడం లేదు. కేంద్రం ఏంచేసినా.. రెండు పార్టీల అధినేతలు కూడా.. మౌనంగా ఉంటున్నారనేది.. ఇప్పటి వరకు ఉన్న వాదన.. ఇక, ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్.. తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి..ఏపీలోకి అడుగులు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇది ప్రత్యక్షంగా అయినా..పరోక్షంగా అయినా.. టీడీపీ, వైసీపీలకు ఇబ్బందే.
అయినప్పటికీ.. ఒక్క మాటకూడా కేసీఆర్‌పై వారు నోరు జారకపోగా.. ఎంతోజాగ్రత్తగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో పార్టీ పుంజుకోవాలని.. నాయకులు తిరిగి వచ్చేయాలని చెబుతున్న చంద్రబాబు.. తెలంగాణలో అధికారంలోకి వస్తామని , కేసీఆర్ పాలనకు చెక్ పెడతామని మాత్రం చెప్పరు. ఇక, జగన్ కూడా.. తెలంగానలో అసలుతాము రాజకీయాలే చేయబోమని చెబుతున్నారు. ఈ పరిస్థితి చూసే.. కేసీఆర్ అంటే కూడా జడుపేనా? అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.