ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి ఇబ్బందులేనా? తాజా అప్డేట్స్ ఇవే!

Update: 2022-11-20 10:30 GMT
ఇప్ప‌టి వ‌ర‌కు పాల‌న ప‌రంగా..రాజ‌కీయంగా కూడా త‌మ‌కు తిరుగులేద‌ని.. ప్ర‌జ‌లు త‌మ‌తోనే ఉన్నార‌ని ప‌దే ప‌దే ప్ర‌చారం చేసుకుంటున్న వైసీపీకి.. తాజాగా ఢిల్లీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు  కంటిపై నిద్ర లేకుండా చేస్తున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది.  ఒకేసారి సుప్రీం కోర్టు రెండు కేసులను తీవ్రంగా ప‌రిగ‌ణిం చ‌డం.. వాటిలో స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ ప్ర‌మేయం ఉండ‌డం వంటివి.. రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారాయి.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా.. వైసీపీ నేత‌లు ఎలాంటి కేసుల‌ను పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఒకింత జంకుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. రెండూ కూడా పెద్ద కేసులు .. పైగా రెండు కూడా వ‌చ్చే ఏడాది ప్ర‌ధానంగా విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డ‌మే. దీంతో రాజ‌కీయంగా ఎన్నిక‌ల‌కు ముందు ఇబ్బందులు త‌ప్పేలా లేవాని  వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతు న్నారు.

ఒక‌టి సీఎం జ‌గ‌న్‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసులో సుప్రీం కోర్టు క్విడ్ ప్రోకో జ‌రిగింద‌ని ప్రాధ‌మికంగా నిర్ధార ణ‌కు వ‌చ్చింది. ఇదేమంత చిన్న విష‌యం కాదు. ప్ర‌స్తుతం ప్రాథ‌మికంగా హెటిరో విష‌యంలో సుప్రీంకో ర్టు క్విడ్ ప్రోకోపై వ్యాఖ్య‌లు చేసినా, మున్ముందు ఇది సీఎం జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకుంటే అది ప్ర‌భావితం చూపుతుంద‌ని వైసీపీ సీనియ‌ర్లు కూడా అంచ‌నా వేస్తున్నారు. అందుకే, నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ మౌనంగా ఉన్నారు.

మ‌రోకేసు ఏకంగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌తోనే ముడి ప‌డింది. గ‌త సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ సీఎం జ‌గ‌న్ రాసిన లేఖ తాలూకు కేసు. దీనిని కూడా సుప్రీంకోర్టు సీరియ‌స్‌గానే తీసుకుంది. దీనిపై ఏదో ఒకటి తేల్చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ రెండు కేసులు క‌నుక పుంజుకుంటే, అవి ఎన్నిక‌ల‌కు ముందు తెర‌మీదికి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అంటే ఎంత లేద‌న్నా మ‌రో ఆరు మాసాల్లో ఇవి చ‌ర్చ‌కు వ‌స్తాయి. ఇది రాజ‌కీయంగా వైసీపీకి దెబ్బ వేయ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నాకు వ‌చ్చారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News