వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ కి తూర్పు తిరిగి దండం పెట్టేశారా...?
వైసీపీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ సక్సెస్ వెనక వినిపించిన ఒకే ఒక పేరు సోషల్ ఇంజనీరింగ్. చక్కగా అన్ని సామాజికవర్గాలను సమతూకం చేసుకుని టికెట్లను ఇచ్చారని, అలాగే చాలా చోట్ల ఆయా వర్గాలకు తగిన విధంగా అవకాశాలను కూడా అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చారని చెప్పుకున్నారు. గడచిన మూడున్నరళ్ళుగా ఏపీలో వైసీపీ అన్నింటా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేస్తున్నామని చెప్పుకుటోంది.
అదే విధంగా నామినేటెడ్ పదవుల నుంచి మంత్రి పదవుల దాకా సామాజిక లెక్కలను పూర్తిగా బట్టి పట్టి మరీ అమలు చేస్తున్నామని అంటోంది. ఇదే తీరున వచ్చే ఎన్నికల్లో సీట్లు కూడా ఇస్తారని ప్రచారం సాగుతున్న వేళ విశాఖ జిల్లాలోని ఒక సీట్లో మాత్రం సోషల్ ఇంజనీరింగ్ రివర్స్ లో అమలు చేస్తారా అన్న సందేహాలు సొంత పార్టీ వారికే కలుగుతున్నాయట.
ఆ సీటే టీడీపీకి కంచుకోట లాంటి తూర్పు నియోజకవర్గం. విశాఖ రెండవ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 లో ఈ సీటు ఏర్పడింది. తొలిసారిగా టీడీపీ తరఫున వెలగపూడి రామక్రిష్ణ బాబు గెలిచారు. ఆయనే 2014, 2019 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 2009 ఎన్నికల్లో కేవలం మూడు వేల ఓట్ల తేడాతో గెలిచిన వెలగపూడి 2014 నాటికి 45 వేల భారీ మెజారిటీని సాధించారు. 2019 నాటికి జగన్ వేవ్ బాగా ఉన్నా కూడా పాతిక వేల ఓట్ల తేడాతో గెలిచి సత్తా చాటారు.
సిట్టింగులకే మళ్లీ సీట్లు అని చంద్రబాబు ఈ మధ్య ప్రకటించిన నేపధ్యంలో 2024 ఎన్నికలలో వెలగపూడి మళ్ళీ తూర్పు నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఆయన్ని ఢీ కొట్టే క్యాండిడేట్ వైసీపీలో ఎవరా అంటే ఈ రోజుకీ లేరు అనే చెప్పాలి. ఇక్కడ నుంచి వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ గా ఉన్న అక్రమాని విజయనిర్మల 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వంశీక్రిష్ణ తాజాగా ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు.
ఇక చూస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ పడుతున్న వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా విశాఖ మేయర్ గా ఉన్న హరి వెంకట కుమారి ఈ సీటు మీద కన్నేశారు, అక్రమాని విజయనిర్మల ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్నారు. ఆమె కూడా ఈ సీటు తనదే అంటున్నారు. ఇక ఎమ్మెల్సీగా ఉన్నా కూడా చాన్స్ వస్తే తాను పోటీకి రెడీ అని వంశీ అంటున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా ఉన్నారు. అయితే వీరంతా కూడా వెలగపూడికి సరిజోడు అవుతారా అన్నదే పార్టీలో ఉన్న చర్చ.
వెలగపూడి కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. అయినా ఆయనకు అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్నాయి. ఆయనతో ఢీ కొట్టాలీ అంటే చౌదరి కమ్యూనిటీ నుంచే అభ్యర్ధిని దించితేనే బాగుంటుందా అన్న చర్చ అయితే పార్టీలో వస్తోందిట. దాంతో పాటుగా విశాఖ ఎంపీగా ప్రస్తుతం ఉన్న ఎంవీవీ సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సీటు మీద కన్నేశారు అని అంటున్నారు. ఆయన పోటీ చేస్తే వంశీ మద్దతు ఇస్తారని అలాగే మేయర్ వర్గం కూడా ఓకే చెబుతుంది అని అంటున్నారు.
దాంతో ఆయన అభ్యర్ధిత్వాని ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు. తొందర్లోనే జగన్ నాయకత్వాన తూర్పు నియోజకవర్గం సమీక్ష జరగనుంది అని చెబుతున్నారు. అందులో అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు.
ఇక చూస్తే తూర్పులో నూటికి ఎనభై శాతానికి పైగా బీసీలు ఉన్నారు. కానీ టీడీపీ ఓసీలకు అందునా చౌదరీస్ కి ఇచ్చి ఈ సీటుని పట్టుకుపోతోంది. దాంతో వైసీపీ కూడా సోషల్ ఇంజనీరింగ్ ని రివర్స్ లో చేస్తూ ఓసీలకే ఇక్కడ సీటు ఇవ్వబోతోంది అన్న ప్రచారం అయితే ఉంది. అదే జరిగితే మరి అత్యధిక శాతం బీసీలు ఉన్న తూర్పులో వైసీపీ సామాజిక న్యాయం తూర్పు తిరిగి దండం పెట్టేసినట్లేనా అన్నదే పెద్ద ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.