కరోనా సమయంలో కొత్తాగా పుట్టుకొనస్తున్న దొంగబాబాలు !

Update: 2020-09-29 00:30 GMT
ఇప్పుడు ప్రపంచంలో కరోనా పేరు వింటేనే గుండెల్లో వణుకు పుడుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి కారణంగా 10 దాదాపుగా లక్షల మంది మృతి చెందారు. 3. 3 కోట్ల మందికి  పైగా ఈ కరోనా వైరస్ భారిన పడ్డారు. ఇలా ప్రతిరోజూ కరోనా వైరస్ విస్తరిస్తూ జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ సమయంలో కూడా  మనిషి భయాన్ని క్యాష్ చేసుకుంటూ బురిడీ బాబాలు పబ్బం గడుపుకుంటున్నారు.

ఇక తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో పాటుగా మోసాలు కూడా పెరుగుతున్నాయి.  జిల్లాలో కొత్తగా దొంగ బాబాలు ప్రత్యక్షమయ్యారు. మృత్యుదేవత తిష్టవేసింది. శాంతి హోమం , ఆ హోమం చేయాలి వేలాది రూపాయలు దండుకొని మాయమవుతున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇళ్లలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం లో వారం రోజులుగా ఇలాంటి మోసాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. కాషాయదుస్తులు, ముఖాన తిలకాలతో దొంగబాబాలు జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. ఇంట్లో మగవాళ్లు లేకపోవడం గమనించి అమాయకంగా ఉండే మహిళలను గుర్తించి వారి వద్ద ప్రత్యక్షం అవుతున్నారు.

 ఇంట్లో మృత్యుదేవత తిష్ట వేసింది. శాంతి లేకుండా చేస్తోంది. పూజలు చేస్తే అంతా శుభం కలుగుతుంది. ఆలస్యమైతే మీ ఆయన చనిపోతాడు అంటూ భయందోళనలకు గురి చేస్తున్నారు.  ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌, గొల్లపల్లి, వెంకటాపూర్ ‌గ్రామాల్లో ఇలాంటి ఘటనలే ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల కిందట ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో ఓ మహిళ ఇంటికి కారులో కాషాయ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు బాబాలు ఇంట్లో అశాంతి నెలకొందని మాయమాటలు చెప్పారు. పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మించారు. వారి మాటలతో నోరు మెదపని మహిళ ఇంట్లో ఉన్న రూ.17 వేలు అప్పగించింది. ఓ కొబ్బరి కాయ, నిమ్మకాయలు ఇచ్చి అక్కడ నుంచి జారుకున్నారు.

మరసటి రోజు అదే గ్రామంలోని మరో మహిళ వద్దకు వెళ్లారు. మీ ఆయనకు దెయ్యం పట్టింది. తొలగిపోవాలంటే తాము పూజలు చేసిన ఓ తాయత్తు ఇస్తామని అందుకు రూ.25 వేలు చెల్లించాలన్నారు. దీంతో సదరు మహిళ దాచుకున్న డబ్బును ముట్టజెప్పింది. ఆమె భర్త వచ్చిన తర్వాత చేతికి కట్టేందుకు ప్రయత్నించగా వ్యతిరేకించిన అతను అందులో ఏముందోనని చూస్తే తెల్లకాగితం కనిపించడంతో మోసపోయినట్టు గ్రహించారు.  బొప్పాపూర్‌ గ్రామంలో ఓ మహిళ ఇంటి వద్ద బీడీలు చుడుతోంది. కారులో వచ్చిన దొంగ బాబాలు ఆమె వద్దకు చేరుకున్నారు. ‘ఇంటిల్లిపాది అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ధనం మీ  దరిచేరడం లేదు’ అంటూ మాటలు చెప్పారు. పూజలు చేస్తే అంతా శుభం కలుగుతుందని నమ్మించి రూ.5 వేలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. వారి మాటలు నమ్మని మహిళ గద్దించింది. లోనికి వెళ్లి.. వ్యవసాయ పొలం వద్ద ఉన్న తన భర్తకు ఫోన్‌ చేసింది. వెంటనే దొంగ బాబాలు ఆమె ముఖంపై నీళ్లు చల్లడంతో మిన్నకుండిపోయింది. ఇంట్లోకి వెళ్లిన బాబాలు పూజలు చేస్తున్న క్రమంలో మహిళ భర్త ఇంటికి చేరుకున్నాడు. దొంగ బాబాలు అతడి పైనా నీళ్లు చల్లారు. భార్యాభర్తలు నోరు మెదపకుండా కూర్చున్నారు. రూ.5 వేలు సమర్పించుకున్నారు.  ఇలా గ్రామంలో సుమారు 15 మంది వద్ద రూ.6 లక్షల వరకు వసూలు చేశారు. వెంకటాపూర్‌లో ఓ పలుకుబడి కలిగిన వ్యక్తి వద్ద నూతన ఇంటిలో పూజలు చేయాలని రూ.50 వేలు పట్టుకెళ్లారు. గ్రామాల్లో కొందరు వీరి తీరు పై అనుమానం వచ్చి నిలదీసిన సందర్భం లో పోలీసులంతా తమవారే అన్నట్లుగా పేర్లు చెప్పడం తో బాధితులు భయపడిపోయారు. బాబాల మాటలు నమ్మి మోస పోవద్దు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే  సమాచారం అందించాలని సిఐ చెప్పారు.
Tags:    

Similar News