అమ్మాయి పనే.. ‘బాయ్స్ లాకర్ రూమ్’లో కొత్త ట్విస్ట్

Update: 2020-05-11 08:00 GMT

నిండా పదిహేను సంవత్సరాలు కూడా లేని ఢిల్లీ స్కూల్ కు చెందిన విద్యార్థులు పెట్టుకున్న ఇన్ స్టాగ్రామ్ గ్రూప్ ‘బాయ్స్ లాకర్ రూమ్’ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ గ్రూపులో చాట్ లో అమ్మాయిల బాడీ షేమింగ్ పై కొందరు.. గ్యాంగ్ రేప్ చేద్దాం అంటూ మరికొందరు విద్యార్థులు చేసిన చాట్ కలకలం రేపింది.

 ఆ 15 ఏళ్లకే మైనర్ బాలికల అశ్లీల ఫొటోలు, వాటిపై వ్యాఖ్యానాలు, శృంగార వాంఛలతో అశ్లీలంగా చేసేశారు.  స్కూలు పిల్లలు అంతా పెట్టుకున్న ‘బాయ్స్ లాకర్ రూమ్’ ఇన్ స్టాగ్రామ్ గ్రూపు పోస్టులు లీక్ కావడంతో వైరల్ అయ్యాయి. స్కూలు పిల్లలు ఇంత దుర్మార్గంగా చేయడంపై ప్రభుత్వం స్పందించింది. పోలీసులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన  ఓ 15 ఏళ్ల మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఓ టీనేజీ అమ్మాయే అబ్బాయిగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిలతో చాట్ చేసినట్టుగా విచారణలో తేలింది. తన శరీరంపై తానే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ దానికి తోటి క్లాస్ మేట్ అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని భావించింది. తానే ఈ పని చేసినట్టుగా పేర్కొందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

సిద్ధార్త్ పేరుతో స్కూలు అమ్మాయి తన శరీరంపై తనే అసభ్యంగా కామెంట్ చేసింది. దానికి అబ్బాయిల రియాక్షన్ బట్టి తన క్యారెక్టర్ తెలుసుకోవచ్చిన ఈ స్కెచ్ వేసిందని పోలీసుల విచారణలో తేలింది.

అంతా స్కూల్ పిల్లలు కావడంతో రహస్యంగా విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు 24 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అందులో అమ్మాయే ఇలా రెచ్చగొట్టిందని తేలింది.
Tags:    

Similar News