మన ముక్కు సైజును బట్టి మన పురుషాంగ పరిమాణమట.. షాకింగ్ అధ్యయనం
శృంగారానికి సంబంధించిన సమస్యలు.. లోపాలు బయటకు చెప్పుకోలేం. అలా ఎందుకు జరుగుతాయి? అసలేంటి లోపాలు అన్నది తెలియవు. ఆధునిక వైద్యశాస్త్రం అందుబాటులో లేని రోజుల్లో ఈ విషయంలో ఎన్నో అపోహలు వ్యాప్తిలో ఉండేవి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు అన్ని శృంగార భయాలను నిగ్గుతేలుస్తున్నారు.
రోమన్ సామ్రాజ్యంలో పురుషాంగ పరిమాణానికి సంబంధించి ప్రజల్లో ఓ నమ్మకం ప్రబలంగా ప్రచారంలో ఉందేట.. వ్యక్తి ముక్కు పరిమాణంపైనే అతడి అంగ పరిమాణం ఆధారపడి ఉంటుందని అప్పట్లో వారు నమ్మేవారు. అందుకే అప్పట్లో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లను, లైంగిక వేధింపులకు పాల్పడే వారి ముక్కులు కోసేవాట.. ఇందులో నిజం ఎంత అనేదానిపై తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించారు.
క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసన్ కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా ఈ వింత అధ్యయనం చేపట్టారు. వారు 126 మంది పురుషుల మృతదేహాలను ఎంచుకున్నారు. మరణించిన వారందరూ 30 నుంచి 50 ఏళ్లలోపు వారే.
ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు వారి అంగపరిమాణంతోపాటు ముక్కు పొడుగు, వెడల్పు, మనిషి పొడువు, వెడల్పు, శరీర నిర్మాణం తీరు ఇత్యాది అంశాలను పరిశీలించారు. మృతదేహానికి అంగస్థంభన సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని పురుషాంగం పొడువును కొలిచారు. ఆ తర్వాత ఓ విశ్లేషణ చేపట్టారు. ముక్కు పరిమాణం బట్టే అంగ పరిమాణం ఉన్నట్టు తేలింది. పెద్ద ముక్కులు ఉన్న వారి సగటు అంగ పరిమాణం పెద్దగా ఉన్నట్టు వెల్లడైంది.
ఇదివరకూ పీఎన్ఏఎస్ జర్నల్ లో మాత్రం మనిషి పొడవు, శరీర నిర్మాణం, అంగం పొడువుకు సంబంధం ఉంటుందని తేల్చారు. చూపుడు వేలు, ఉంగరం వేలు పొడవుల నిష్ఫత్తిపై అంగం సైజు ఆధారపడి ఉంటుందని తేల్చారు.
ఈ నిష్పత్తి తక్కువగా ఉండే వారి అంగం పొడువు ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. జపాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇలాంటివేవి కనిపించలేదు. ఇది మృతదేహాలపై అధ్యయనం కావడంతో ఇంకా పరిశోధన జరగాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.