కాంగ్రెస్ కు త్వరలోనే కొత్త అధ్యక్షుడు!

Update: 2021-01-22 17:30 GMT
వరుస ఓటములు.. జారిపోతున్న నేతలతో వందేళ్ల కాంగ్రెస్ పార్టీ దేశంలో కుదేలవుతోంది. ఈ క్రమంలోనే సీనియర్ల తిరుగుబాటుతో మరింత మసకబారింది. కాంగ్రెస్ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. కాంగ్రెస్ ప్రస్తుత అధినేత్రి సోనియా గాంధీ ఈ మేరకు జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి మూహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం.

జూన్ 1లోగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక కాబడిన అధ్యక్షుడు బాధ్యతలు చేపడుతాడని ఆపార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం పార్టీ నేతలు వేణుగోపాల్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు. జూన్ లోగా కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు.

పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని నేతలు గట్టిగా నిలదీసినట్లు సమాచారం. సీనియర్లు గులాం నబీ, ఆనంద్ శర్మల మధ్య మాటల యుద్ధం సాగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నిక ద్వారానే కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు నేతలు తెలిపారు.

ఇక త్వరలో జరిగే కేరళ, తమిళనాడు, అసోం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మార్పులు చేపట్టడానికి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

2019లో దేశంలో కాంగ్రెస్ ఓటమి తర్వాత అప్పటి అధ్యక్షుడు రాహుల్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. ఇప్పటికీ కొత్త అధ్యక్షుడిని వివాదాలతో ఎన్నుకోవడం లేదు.
Tags:    

Similar News