అమెరికాలోని ఆ రాష్ట్రంలో కొత్త బిల్లు.. సెక్సు మధ్యలో కండోమ్ తీయకూడదు

Update: 2021-09-15 04:00 GMT
అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ఉండే అగ్రరాజ్యంలోని రాష్ట్రాలు చాలా పవర్ ఫుల్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమకు తగ్గట్లుగా చట్టాలు చేసుకునే హక్కు ఉంటుంది. అందుకే.. అమెరికాలోని ఒక రాష్ట్రంలో నేరం కానిది.. మరో రాష్ట్రంలో నేరమవుతుంది. అందుకే.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నిబంధనలు మారిపోతూ ఉంటాయి. అందుకే.. అక్కడికి వెళ్లి వేరే రాష్ట్రానికి మారే వారు.. అక్కడి స్థానిక చట్టాల గురించి అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. తాజాగా అమెరికాలోని ఒక రాష్ట్రంలో ఒక ఆసక్తికర బిల్లు తెర మీదకు వచ్చింది.

తాజాగా చట్టసభలో బిల్లు రూపంలో ఉన్న ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే.. అధికారికంగా చట్టంగా మారనుంది. హాట్ టాపిక్ గా మారిన ఈ బిల్లులు ఏముందంటే.. సెక్సు చేసే సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగించకూడదు. ఒకవేళ అలా చేస్తే దానిని ఇకపై నేరంగా పరిగణిస్తారు.. శిక్షను విధిస్తారు. ఇదే విషయానికి సంబంధించి ఏబీ 453 పేరుతో కొత్త చట్టం కోసం బిల్లును ప్రతిపాదించారు.

తాజాగా ఈ బిల్లును కాలిఫోర్నియాలోని అసెంబ్లీ సభ్యురాలు క్రిస్టినా గార్సియా తెర మీదకు తీసుకొచ్చారు. ఈ మధ్యనే ఈ బిల్లుకు అసెంబ్లీ ఓకే చెప్పింది. అయితే.. దీనికి గవర్నర్ సంతకం తర్వాతే చట్టంగా రూపు దిద్దుకోనుంది. ఒక వేళ ఈ బిల్లుకు గవర్నర్ సంతకం చేస్తే.. ఈ తరహా సంచలన బిల్లును తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచిపోనుంది. ఇంతకీ ఈ బిల్లును తీసుకురావటానికి కారణాల్ని చూస్తే.. కాలిఫోర్నియా సివిల్ కోడ్ సెక్షన్ 1708.5ను సవరిస్తూ 453 బిల్లును తీసుకొచ్చారు.

సెక్సు చేసే సమయంలో ఏ విధంగానే భాగస్వామిని గాయపరిచేలా వ్యవహరించకూడదు. అలా చేస్తే అది 1708.5 సెక్షన్ ప్రకారం నేరం. అతడు కానీ ఆమె కానీ వారి ప్రైవేట్ పార్ట్స్ ను గాయపరిస్తే నేరం చేసినట్లే. దీనికి కొనసాగింపుగా తీసుకొచ్చిందే ఈ 453 బిల్లు. దీని ప్రకారం.. శృంగార సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్స్ తొలిగించడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే.. నేరం కావటమే కాదు.. శిక్ష కూడా ఖాయమంటున్నారు. కాకుంటే.. ఇది చట్టంగా మారటానికి మరో అడుగు మాత్రమే మిగిలి ఉంది. గవర్నర్ సంతకం పడినంతనే ఇది చట్టంగా మారనుంది.
Tags:    

Similar News