పాలిటిక్స్ పై ప్రాణం చావలేదు..: వెంకయ్య
ఆయన ఈ దేశానికే రెండో పౌరుడు. అత్యంత కీలకమైన రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి. అయితేనేం.. తనకు ఈ పదవిపై మోజు లేదని కుండబద్దలు కొట్టారు. తాను ఒకరకంగా బలవంతంగానే ఈ పదవిని అధిరోహించాల్సి వచ్చిందన్నారు. అంతేకాదు, తనకు ప్రత్యక్ష రాజకీయాలు చేయడంలోనే ఆత్మానందం ఉందని చెప్పుకొచ్చారు. ఆయన ఎవరో కాదు - ఏపీ వాసి - దేశానికి రెండో పౌరుడుగా ఉపరాష్ట్రపతిగా చక్రం తిప్పుతున్న కీలక నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు. నిజానికి దివంగత కాకా(కే వెంకటస్వామి) ఈ పదవి కోసం కుదిరితే రాష్ట్రపతి పదవి కోసం వెంపర్లాడిపోయారు. ఇలాంటి సీనియర్లు చాలా మందే ఉన్నారు.
కానీ, కోరి వచ్చిన ఈ పదవిని తనకు ఇష్టం లేదని చెప్పిన ఏకైక ఉపరాష్ట్రపతిగా వెంకయ్య రాజకీయ వర్గాల్లొ చర్చకు వస్తున్నారు. ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్య తన మనసులో మాటను మరోసారి వేదికగా వెల్లడించారు. భారతీయ జనసంఘ్ నాయకుడిగా పనిచేసిన ఆయనలో ఇంకా పోరాట పటిమ తగ్గలేదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. నానాజీ దేశ్ ముఖ్ వంటి వారి అడుగు జాడల్లో నడిచిన తనకు ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన పదవి సంకెళ్లు వేసిందని అన్నారు.
అంతేకాదు, తనను ఉపరాష్ట్రపదవికి ఎంపిక చేశారనే వర్తమానం అందినప్పుడు తాను సంతోషించలేదని - కన్నీరు పెట్టుకున్నానని - ఈ పదవి కారణంగా తనకు ఎంతో ఇష్టమైన బీజేపీ కార్యాలయానికి వెళ్లే అవకాశం లేకుండా పోవడం బాధించిందని చెప్పారు. ప్రధాని పదవి తప్ప తనకు పార్టీ అన్నీ ఇచ్చిందని కొనియాడారు. తనకు ఆయా పదవులు ఇచ్చినా.. వాటిని తగిన అర్హత తనకు లేదని చెప్పారు. నరేంద్ర మోడీని రెండో సారి ప్రధానిగా చేయాలని తాను ఎంతో భావించానని - ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఉంటే.. తాను మోడీ రెండోసారి ప్రధాని అయ్యాయ నానాజీ దేశ్ ముఖ్ అనుచరుడిగా పార్టీ నుంచి బయటకు వచ్చి రచనాత్మక కార్యక్రమంలో భాగమయ్యేవాడినని వెల్లడించారు.
నిజానికి ఉపరాష్ట్రపతి పదవికి నేతలను ఎంచుకునే సమయంలో తానే కొందరి పేర్లు సూచించానని వెల్లడించారు. అయితే, పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అమిత్ షా సహా అందరూ నేనే ఆ పదవికి సూటవుతానని భావించి ఎంపిక చేశారన్నారు. ఏబీవీపీ - ఆర్ ఎస్ ఎస్ వంటివి మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.