చెడిపోయిన కారు పేరుతో ఈ ఇమేజ్ బిల్డింగ్ ఏమిటి బాబు?
టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి ఉన్న ఒక అలవాటు ఆయనకు వచ్చే పేరు ప్రఖ్యాతులకు అవరోధంగా మారిందని చెప్పాలి. కొన్ని విషయాల్లో వెతుక్కుంటూ రావాల్సిన మైలేజీకి భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం.. అలాంటి ఇష్యూలను తనదైన శైలిలో కెలికే బాబు తీరుతో అది కాస్తా పోతోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటుచేసుకుంది.
దీపావళి నేపథ్యంలో ఏపీలోని అమరావతిలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ కు బయలుదేరారు. లాక్ డౌన్ వేళ మొత్తం హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమయ్యారు. ఈ మధ్యనే అమరావతిలోని ఉండవల్లి ఇంట్లో ఉంటున్నారు. పండుగ వేళలో హైదరాబాద్ కు బయలుదేరటం బాగానే ఉన్నా.. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ఫ్రూప్ కారు సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. నార్కట్ వల్లి వద్ద మొరాయించిన కారు గురించి మీడియాలో బ్రేకింగ్ లు పడ్డాయి. దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డు మీద ఉండిపోయిన ఆయన.. తర్వాత వేరే కారులో హైదరాబాద్ కు బయలుదేరారు.
సాధారణంగా ఇలాంటి విషయాల మీద మిగిలిన అధినేతలు పెద్దగా మాట్లాడరు. కానీ.. బాబు రూటు సపరేటు కదా. తన అనుచర వర్గం చేత ఆయనో ప్రకటన లాంటిది రవిడుదల చేశారు. దాని సారాంశం ఏమంటే.. బాబు ప్రయాణించే ప్రధాన వాహనం 60 వేల కిలోమీటర్లు తిరిగిందని.. పిరియాడికల్ గా మార్చాల్సిన క్లచ్ ప్లేట్లు మార్చలేదంటున్నారు. ఈ కారణంగానే సదరు వాహనం మొరాయించిందని చెబుతున్నారు.
జెడ్ కేటగిరి ఉన్న అధినేతకు పంపే కారు విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అది కూడా కొంతమేర నిజమే అయినా.. బాబు పరివారానికి కూడా బాధ్యత ఉంటుందన్నది మర్చిపోకూడదు. అదే సమయంలో.. తాను వాడుతున్న కారు గురించి బాబు వాళ్లసాయం.. వీళ్ల సాయం కాకుండా తన జేబులో నుంచి నాలుగు రూపాయిలు తీసి.. బాగు చేయించుకుంటే ఏమైందని ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి చిన్న విషయాలకే ఏదేదో జరిగినట్లుగా ప్రచారం చేసుకోవటం ఏపీ ప్రజలకు ఏమాత్రం నచ్చటం లేదంటున్నారు. ఇలాంటి వాటి ప్రచారంతో మైలేజీ వస్తుందని బాబు ఆలోచన సరికాదంటున్నారు. చిన్న విషయాల్ని పట్టించుకోనట్లుగా ఉండటం చాలా అవసరమంటున్నారు. మరి.. ఇలాంటి వాటి నుంచి బాబు ఎంత త్వరగా బయటకు వస్తారో?