‘వామ్మో ఇదేందయ్యా.. ఇది’ ఐపీఎల్ లో నకిలీ అరుపులపై జోకులు

Update: 2020-09-22 01:30 GMT
ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఐపీఎల్​ సీజన్​ 13 ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా స్టేడియంలో అభిమానులు, చీర్స్​ గర్ల్స్​ లేకపోవడంతో ఈ గేమ్​ చప్పగా సాగుతున్నది. అయితే ఈ లోటును పూడ్చేందుకు ఐపీఎల్​ ఓ వినూత్న ఆలోచన చేసింది. స్టేడియంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఆ స్క్రీన్లలో చీర్స్​ గర్ల్స్​ మనకు కనువిందు చేస్తున్నారు. మరోవైపు బాట్స్​మెన్​ ఫోర్లు, సిక్సులు బాదినప్పుడు, వికెట్​ పడ్డప్పుడు అభిమానులు కేరింతలు పెడుతూ.. చప్పట్లు కొడుతున్నట్టు భ్రమపడేలా ఆర్టిఫీషియల్ శబ్ధాలు వినిపిస్తున్నాయి, దీంతో టీవీ చూస్తున్న అభిమానులు కొంతమేర థ్రిల్​ అవుతున్నారు. అయితే మరికొందరు అభిమానులు మాత్రం సోషల్ ​మీడియా లో దీన్ని ఫన్నీ గా ట్రోల్​ చేస్తున్నారు.  

ఐపీఎల్​ నకిలీ అరుపులను కోట్​ చేస్తూ ఓ తెలుగు అభిమాని ‘వామ్మో ఇదేందయ్యా.. ఇది.. మేమెప్పుడూ చూడలా’ అంటూ ఓ మీమ్​ ను వదిలాడు. ప్రస్తుతం ఈ మీమ్​ వైరల్​గా మారింది. ‘ఎవరు లేని క్రికెట్‌ స్టేడియంలో లక్షల మంది ప్రేక్షకులు ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక జోక్‌’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘ ఈ ఆలోచన కొత్తగా ఉన్నప్పటికీ సహజత్వం లోపించింది’ అంటూ మరో నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ తరహాలో పలువురు సోషల్​మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాక మరికొన్ని మీమ్స్​ కూడా ట్రెండ్​ అవుతున్నాయి. ‘నాకు ఐపీఎల్​ అంటే ఎంతో ఇష్టం.. కానీ మా టీవీలో వచ్చే కార్తీకదీపం సీరియల్​ కూడా ఇష్టమే.. రెండు ఓకే సమయంలో వస్తుండటంతో నేను సీరియల్​ మిస్సవుతున్నారు. మా టీవీ టీం వారు దయచేసి సీరియల్​ టైం మార్చండి’ అంటూ ఓ అభిమాని ఫేస్​బుక్​లో పోస్ట్​పెట్టాడు. ఈ మీమ్​ వైరల్​గా మారింది.
Tags:    

Similar News