కరోనా దేవి ఏంటి ఆ వివాదాస్పద నటి మాదిరిగా ఉంది!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ ను కట్టడి చేయడానికి ఎవరికి తోచిన పనులను వారు చేస్తున్నారు. గో కరోనా అంటూ కొందరు పాటెత్తుకుంటే అమ్మవారిగా మరికొందరు పూజలు చేస్తున్నారు. కరోనా దేవి పేరిట ఓ విగ్రహాన్ని రూపొందించారు. ఆ ప్రతిమను ప్రతిష్ఠంచి కరోనా త్వరగా అంతం కావాలని కోరుతున్నారు.
ఈ కరోనా దేవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పూజలు విషయంలో కాదు. ఆ విగ్రహ రూపం ఓ నటి మాదిరిగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తరుచుగా వార్తల్లో నిలిచే వివాదాస్పద నటి వనిత విజయ్ కుమార్ ను ఈ వ్యవహారంలోకి లాగారు. ఆ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
కరోనా దేవి అచ్చం నటి వనిత విజయ్ కుమార్ లాగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. కరోనా దేవి ఏంటి ఆమెలాగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మీమ్స్ రూపొందిస్తున్నారు. పైగా వాటిని ఆమెకే పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. నెటిజన్లు చేసిన పని పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.