అక్షర్ ఉండగా టీ20కి జడేజా ఎంపిక ఎందుకు? సంజయ్ మంజ్రేకర్ హాట్ కామెంట్స్
వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి హాట్ కామెంట్ చేశాడు. ‘అంతర్జాతీయ టీ20కి రవీంద్ర జడేజాను ఎంపిక చేయడం తప్పు.. అతడి స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకోవాల్సింది. ప్రస్తుతం అక్షర్ స్పిన్నర్‌గా ఎంతో రాణిస్తున్నాడు’ అంటూ సంజయ్ వ్యాఖ్యానించాడు. సంజయ్ కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. పలువురు అభిమానులు అతడి వ్యాఖ్యలతో ఏకీభవిస్తుండగా.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా సాగే ఈ టూర్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. సునీల్ జోషీ ఆధ్వర్యం లోని కొత్త సెలెక్షన్ కమిటీ సోమవారం వర్చువల్ గా సమావేశమై.. ఈ సిరీస్‌ల కోసం వేర్వేరు గా జట్లను ఎంపిక చేసింది. ఈ ఎంపిక పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా రోహిత్ శర్మను ఈ టూర్ మొత్తానికి తప్పించారు. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి. 'టీ20లకు రవీంద్ర జడేజా పనికిరాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ తీసుకోవాల్సింది. మీరేమంటారు?'అని మంజ్రేకర్‌ను ట్విటర్ లో ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి మంజ్రేకర్ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని తెలిపాడు. జడేజాకు బదులు, అక్షర్ పటేల్‌ను తీసుకోవాల్సిందని తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాడు. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరూ జడేజానే సరైనవాడంటే మరికొందరూ అక్షర్‌కు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే మంజ్రేకర్ గతంలోనూ జడేజాపై కామెంట్లు చేశాడు.
'బిట్స్ అండ్ పీసెస్' ఆటగాడిగా అభివర్ణించాడు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 'వాయిస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్'గా పిలిచే హర్షా భోగ్లే ను కూడా కించ పరిచేలా మాట్లాడాడు. భోగ్లే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కానీ, లిస్ట్ ఎ మ్యాచ్‌లు కానీ ఆడలేదని విమర్శించాడు. అప్పట్లో జడేజా కూడా మంజ్రేకర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నీ నోటి విరేచనాలను ఆపు'అని బదులిచ్చాడు. దాంతో వారి మధ్య మాటల యుద్దం నడిచింది. దీంతో బీసీసీఐ కామెంటేటర్ గా సంజయ్ మంజ్రేకర్ పై వేటు వేసింది. ఐపీఎల్ 2020 సీజన్ కామెంటేటర్ లిస్ట్ నుంచి అతన్నితప్పించింది. అయినా మంజ్రేకర్ మాత్రం తన నోటి దురుసు ను తగ్గించుకో లేకపోతున్నాడు.