షాకింగ్ నిర్ణయం: రష్యన్ సినీ కంటెంట్ పై నెట్ ఫ్లెక్స్ నిషేధం
రష్యాపై ఆర్థిక ఆంక్షలే కాదు.. వినోద ఆంక్షలు విధిస్తున్నారు. ప్రైవేటు సంస్థలు కూడా ఈ నిషేధం జాబితాలోకి రావడం గమనార్హం. గత వారం రోజులుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చిన్న దేశమైన ఉక్రెయిన్ పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ప్రపంచంలోని ఆయా దేశాలు రష్యాపై వివిధ రకాలుగా ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇక ప్రైవేటు సంస్థలు కూడా ఆ జాబితాలోకి చేరాయి. ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సైతం రష్యా దేశంపై చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే డిస్నీ, వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థలు రష్యాలో తమ సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సైతం అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. ఇక నుంచి రష్యాకి సంబంధించిన ఎటువంటి కంటెంట్ ని కొనమని ఆ సంస్థ మేనేజ్ మెంట్ ప్రకటించింది.
ఇప్పటికే ఒప్పందం కుదిరిన నాలుగు వెబ్ సిరీస్ లపై సైతం ఈ నిర్ణయాన్నే అమలు చేయనుంది. దాషా ఝుక్ దర్శకత్వం వహిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించిన ఒప్పందాన్ని మాత్రం ప్రస్తుతం హోల్డ్ లో ఉంచింది.భవిష్యత్తులో ఎలా ఉంటుందనే విషయంపై ఆ యుద్ధం ముగిసిన తర్వాతే ఓ క్లారిటీ రానుంది.