నయీం ప్లేసులో ఫయీం..!సెటిల్‌ మెంట్లు.?!

Update: 2019-03-12 09:12 GMT
తెలుగు రాష్ట్రాల్లో డాన్‌ గా పేరొందిన నయీం పేరు తెలియని వారుండరు.. దాదాపు 20 ఏళ్లపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన నయీం చివరికి గ్రేహాండ్స్‌ పోలీసుల చేతిలో 2016లో హతమయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో పూర్వపరాలను పోలీసులు ఛేదిస్తూనే ఉన్నారు. నయీం వెనుక ఎవరున్నారు..? అతని మూఠాలోని సభ్యులెవరు..? అనే కోణంలో పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా తాజాగా మరో కీలక వ్యక్తి బయటికి వచ్చారు. అతను అచ్చం నయీం పోలికలతోనే ఉండడం విశేషం.

ఆయన నయీం అయితే ఈయన ఫయీం అట. ఫయీం ఫొటోలు హైదరాబాద్‌ శివార్లలో కలకలం సృష్టిస్తున్నాయి. నయీం సామ్రాజ్యానికి అధినేతగా వ్యవహరించేందుకు ఫయీం ఇలా అచ్చం నయీం లాగే గెటప్‌ మార్చారని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎడమ చేతిలో కడెం - మెడలో బంగారు గొలుసులతో పాటు నల్లటి జీన్స్‌ టీషర్ట్‌ వేసిన ఈయన టోపీ బ్యాక్‌ సైడ్‌ పెడితే నయీం అనే అంటారు.

  మరో కొత్త విషయం కూడా వెలుగులోకి వచ్చింది. నయీం భార్య హసీనా బేగం పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. నయీం నేర సామ్రాజ్యంలో ఆమె కూడా బాధ్యురాలేనని పోలీసులు గుర్తించారు. అయితే నయీం బతికే ఉన్నాడని - అతను చనిపోయానడన్నది అవాస్తవమని చెబుతూ ఫయీం అనే వ్యక్తికి ఈ విధంగా గెటప్‌ వేసి ప్రచారం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నయీం దందాలను ఫయీం ద్వారా చేసేందుకు హసీనా ప్రయత్నించిందనే చర్చ సాగుతోంది. కొన్ని సెటిల్‌మెంట్లలో ఇలా ఫయీంను వాడుకొని అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.
Tags:    

Similar News