చైనాలో సెలబ్రేషన్స్.. హద్దులు లేవు.. ఆపేవాడు లేడు
చైనాలో ప్రస్తుతం జాతీయ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ దేశంలో కరోనా మొత్తానికే లేకుండా పోయింది. దీంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం సోషల్ డిస్టెన్సింగ్ అనే మాటే లేదు. ప్రజలు పబ్లిగ్గానే ముద్దులు పెట్టుకుంటూ, చిందులు వేస్తూ బయటకొచ్చి పండుగ చేసుకుంటున్నారు. కోట్లాది మంది ఒకేచోట గుమిగూడి ఎంజాయ్ చేస్తున్నారు. చైనాలో 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' ఏర్పడిన రోజును జాతీయ దినోత్సవంగా జరుపుకొంటారు. ఈ ఏడాది సంప్రదాయ 'మిడ్ ఆటమ్ ఫెస్టివల్' కూడా ఇదే తేదీల్లో రావడంతో ప్రజలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
ఈ ఎనిమిది రోజులను చైనాలో ‘గోల్డెన్వీక్’ గా ప్రకటించారు. దీంతో 5.5 కోట్ల మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని సమాచారం. గత ఫిబ్రవరి తరువాత గురువారం అత్యధికంగా 1.3 కోట్ల రైలు ట్రిప్‌లు వేసినట్లు చైనా మీడియా చెబుతోంది. ఈ ఎనిమిది రోజుల సెలవుల్లో రైళ్లు 10.8 కోట్ల ట్రిప్‌లు తిరుగుతాయని చైనా రైలు సేవల సంస్థ చెబుతోంది. పీపుల్స్ రిపబ్లిక్ చైనా 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజింగ్‌లో చేసిన పతాకావిష్కరణను చాలామంది తిలకించారు. చాలా మంది ఈ సెలవు రోజులను విహారానికి వినియోగించుకుంటున్నారు.
లిజియాంగ్ వంటి నైరుతి చైనా నగరాలకు విమానాల టికెట్లన్నీ అమ్ముడు పోయాయని ట్రావెల్ సర్వీసెస్ ‘కునార్’ రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పింది. గత ఏడాది తో పోల్చితే ఈసారి 10.5 శాతం అదనం గా బుకింగ్ లు నమోదయ్యాయని చైనా విమానయాన సంస్థ తెలిపింది. గత ఏడాది ఈ సమయం లో 70 లక్షల మంది విదేశాలకు ప్రయాణించారని.. ఈసారి ప్రపంచంలోని పలుదేశాలు, నగరాల్లో నియంత్రణలున్నా బుకింగ్స్ పెరిగాయని చెబుతోంది. చైనాలో కరోనా ప్రబలడం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 91,545 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,739 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా అదుపులోనే ఉంది.