సొంత డబ్బా కోసం స్వయంగా దిగనున్న మోడీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం ద్వారా అన్యాయం జరుగుతున్నదనే ప్రచారానికి విరుగుడుగా రాష్ట్ర భాజపా నాయకులు కూడా తమ వంతు గందరగోళం సృష్టిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెడుతున్న ప్రతిరూపాయి కేంద్రం ఇస్తున్నదే అని అంటున్నారు. కేంద్ర పథకాలకే పేర్లు మార్చి రాష్ట్రం లబ్ధి పొందుతున్నదని ఎద్దేవా చేస్తున్నారు. పేజీలకు పేజీల కొద్దీ.. కొన్ని పుస్తకాల పరిమాణంలో ఉండేలాగా నివేదికలను విడుదల చేస్తున్నారు. గణాంకాలను తమకు తోచిన రీతిలో అప్పజెబుతున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ.. భాజపా ను రాష్ట్రప్రజలు మాత్రం నమ్మడం లేదు. ఈ సత్యాన్ని ప్రధాని నరేంద్రమోడీ కూడా గుర్తించినట్లుంది. ఏదో 25 సీట్లున్న కీలక దక్షిణాది రాష్ట్రం. అవసరమైన సమయాల్లో ఉపయోగపడుతోందని అనుకుంటే.. అక్కడ ప్రజలు తమను ఛీ కొడుతున్నారని ఆయన తెలుసుకున్నట్లుంది. తెలుగు ప్రజలను కన్విన్స్ చేయడంలో రాష్ట్ర నాయకత్వం గొంతు చాలడం లేదని - వారి పొలికేకలను కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అధిష్టానానికి అర్థమైపోయింది. అందుకే కేంద్రం తరఫున సొంత డబ్బా కొట్టుకోవడానికి ఏకంగా మోడీనే స్వయంగా ఆంధ్రప్రదేశ్ కు రావడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏపీలో ఏదైనా కార్యక్రమానికి అతిథిగా హాజరు కావాలని ప్రధాని నరేంద్రమోడీ అనుకుంటున్నట్లుగా పీఎంఓ తెలియజేసింది. ఢిల్లీలో ఉండే ఏపీ రెసిడెంట్ కమిషనర్ ను సంప్రదించి, ఏపీలో అమల్లో ఉన్న కేంద్రప్రభుత్వ ప్రాజెక్టుల గురించి ఆరా తీసిందిట. ఏవైనా కేంద్ర ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయా? శంకుస్థాపనలకు సిద్ధంగా ఉన్నాయా? అలా ఉండేట్లయితే ఆ కార్యక్రమాలకు హాజరు కావాలని మోడీ అనుకుంటున్నారు. అంటూ పీఎంఓ లేఖ రాసిందిట.
అచ్చంగా ఆయన కేంద్రం గురించిన పాజిటివ్ విషయాలను ఏపీ ప్రజల ముందు ప్రచారంలో పెట్టుకోవడానికి - సిద్ధమవుతున్న కేంద్ర ప్రాజెక్టుల వివరాలను మాత్రమే అడిగినట్లుగా ఇది కనిపిస్తోంది. ఆ కార్యక్రమాలకు హాజరైతే గనుక.. ఇదంతా తమ నిధులతోనే తమ చేతుల మీదుగానే జరుగుతున్నదని.. ఆ సభలో రాష్ట్రమంతా తెలిసేలా సొంత డబ్బా కొట్టుకోవాలనే యోచన ఆయనకు ఉండవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. అందుకే ప్రత్యేకించి కేంద్ర ప్రాజెక్టులను ఎంచుకోవాలని అనుకుంటున్నారట. అయినా మోడీ మరియు ఆయన దళం రాష్ట్రంలో ఇప్పటిదాకా టెంకాయ కొట్టిన కార్యక్రమాలన్నీ అలాగే పడి ఉన్నాయి. మరి ఇప్పుడొచ్చి నిధుల కాకమ్మ కబుర్లు చెబితే.. జనం నమ్ముతారని భాజపా ఎలా భావిస్తోందో అర్థం కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.