ఏపీ మాదిరే గోవాకూ దెబ్బేసిన మోడీ
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అధికారం.. అధిపత్యం శాశ్వితం కాదని.. తాత్కాలికమేనన్న సత్యం కమలనాథులకు బోధ పడే టైం వచ్చేసింది. పవర్ లో ఉన్నప్పుడు ఇచ్చిన హామీల్ని మర్చిపోవటం మిగిలిన పార్టీలకు ఎలా అలవాటో.. బీజేపీకీ అంతేనన్న విషయం ఏపీ.. గోవా విషయాల్ని చూస్తే అర్థమవుతుంది. సార్వత్రిక ఎన్నికల వేళ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్న బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని.. తాము పవర్ లోకి రాగానే ఈ హామీని నెరవేరుస్తామని ప్రకటించారు.
ఆ హామీ విషయంలో ఏపీకి ఏ స్థాయిలో మోడీ హ్యాండ్ ఇచ్చారో ప్రతి ఆంధ్రోడికి తెలిసిందే. ఇలాంటి ప్రత్యేక హోదా హామీలు ఏపీకే కాదు.. మరికొన్ని రాష్ట్రాలకు హామీ ఇచ్చి ఎగనామం పెట్టటం బీజేపీకి అలవాటేనన్న విషయం గోవా ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 2012లో గోవా రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది.. బుల్లి గోవాకు ప్రత్యేక హోదా ఇవ్వటం. అయితే.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ అమలు సాధ్యం కాదని గత నవంబరులో తేల్చి చెప్పారు. ఈ హామీ మాత్రమే కాదు.. మండోవి నదీ తీరం వెంట క్యాసినోలు తొలగిస్తామన్న హామీని కమలనాథులు నిలబెట్టుకోలేదు.
కేంద్రంలో తమ ప్రభుత్వం కొలువు తీరి లేనందున పనులు ఇచ్చిన హామీలు సాకారం కావటం లేదన్నట్లుగా చెప్పినప్పటికీ.. మోడీ కొలువు తీరిన తర్వాతే అదే పరిస్థితి కంటిన్యూ కావటం బీజేపీకి ఇప్పుడు శాపంగా మారిందని చెప్పాలి. ఐదు రాష్ట్రాలకు నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గోవా కూడా ఒకటి. ప్రస్తుతం అధికారపక్షంగా ఉన్న రాష్ట్రంలో గత ఎన్నికల ప్రధాన హామీలు నెరవేర్చని వేళ.. గోవా ప్రజలు విపరీతమైన అసంతృప్తిలో ఉన్నారు. దీనికి తోడు రాజకీయంగా కూడా బీజేపీ ఇక్కడ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.
2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. ఎంజీపీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. మొత్తం 40 స్థానాలున్న గోవాలో 21 స్థానాల్లో బీజేపీ సొంతంగా విజయం సాధించినప్పటికీ.. ఎంజీపీ గెలుచుకున్న మూడు సీట్లతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారీకర్ నాడు గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే.. ఆ తర్వాత ఆయన కేంద్రానికి వచ్చేయగా.. సీఎం పదవీ బాధ్యతల్ని లక్ష్మీకాంత్ పార్సేకర్ ను ముఖ్యమంత్రిగా నియమించారు. సీఎం కుర్చీలో కూర్చొని రెండేళ్లు అవుతున్నా.. పాలన మీద పట్టు పెంచుకోవటంలోనూ.. ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవటంలో ఆయన విఫలమైనట్లుగా చెబుతారు.
ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీ సర్కారు నుంచి ఎంజీపీ తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు గోవా ఆర్ ఎస్ఎస్ అధ్యక్షుడిగా పని చేసిన సుభాష్ వెలింగ్ కర్ గోవా సురక్ష మంచ్ ను ఏర్పాటుచేశారు. బీజేపీ పాలనలోని లోపాల్ని ప్రశ్నించటంతో ఆయనపై వేటుపడింది.దీంతోఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన గోవా సురక్ష మంచ్ తో ఎంజీపీ.. శివసేన కలుస్తుండటం బీజేపీకి దెబ్బ పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇచ్చిన హామీల్నినెరవేర్చే విషయంలో ఏపీ మాదిరే గోవాను దెబ్బేసిన మోడీ అండ్ కోకు.. తాజా ఎన్నికల్లో గోవా ప్రజలు ఏ మేరకు దెబ్బేస్తారో చూడాలి. ఈ విషయం మీద స్పష్టత రావాలంటే మార్చి 11 వరకూ వెయిట్ చేయాల్సిందే. ఆ రోజే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/