రైలు ప్రయాణికులకు మోడీ షాకిస్తున్నారే.?

Update: 2019-08-29 07:04 GMT
అసలే ఆర్థిక సంక్షోభం.. ఆ పై మందగమనం.. పారిశ్రామిక దిగ్గజాలన్నీ నేల చూపులు చూస్తున్నాయి. ప్రజల వద్ద పైకం తగ్గుతోంది. ఇప్పటికే ఆర్బీఐ వద్ద 2 లక్షల కోట్లు లాగి సర్దుబాటు చేయడానికి మోడీ ప్లాన్ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి గుదిబండగా తయారైన రైల్వేల్లో ప్రైవేటీకరణ దిశగా ప్లాన్ చేస్తున్నట్టు సంకేతాలు పంపారు.

తాజాగా రైల్వేలో తొలి ప్రైవేటు రైలు పట్టాలెక్కబోతోంది. ఢిల్లీ-లక్నో మధ్య ‘తేజస్’ ఎక్స్ ప్రెస్ రైలును దేశంలోనే తొలి ప్రైవేటు రైలుగా చెబుతున్నారు. దీన్ని నడిపాక విజయవంతం అయితే ఢిల్లీ అహ్మదాబాద్ మధ్య మరో ప్రైవేటు రైలును నడిపిస్తారట..

ఇందులో విశేషం ఏంటంటారా? ఇందులో ధరలు భారీగా ఉంటాయి. అంతేకాదు.. రైళ్లలో ఇచ్చే 53 విభాగాల రాయితీలు ప్రయాణికులకు వర్తించవు. పిల్లలకు- వృద్ధులకు టికెట్లలో మినహాయింపు ఉండదు.. ఫుల్ టికెట్ తీసుకోవాలి. ఇక టికెట్ ధర విమాన ప్రయాణ చార్జీల కంటే కొంచెం తక్కువ అట.. సో రైలు వ్యవస్థను ప్రైవేటు పరం చేయడానికి మన మోడీ సర్కారు నాందిపలుకబోతున్నట్టు   అర్థమవుతోందంటున్నారు.

ఇక సాధారణ రైళ్లలో కూడా ఓ గుడ్ న్యూస్ ను చెప్పింది కేంద్రం. రైలు ఆలస్యంగా నడిచే పక్షంలో పరిహారంగా కొంత మొత్తాన్ని ప్రయాణికులకు వాలెట్ కు పంపిస్తారట.. గంట ఆలస్యంగా చేరుకున్నా ప్రయాణికులకు నష్టపరిహారంగా డబ్బులు ఇస్తారన్నమాట.. ఇలా రైల్వేలో సంస్కరణల బాట పట్టిన కేంద్రం ప్రయాణికులకు షాకిచ్చే నిర్ణయాలు, మేలేచేసే నిర్ణయాలు ఎన్ని తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News