మోడీ కేబినెట్ మంత్రుల నిజస్వరూపమిదీ..
కేంద్రంలో రెండోసారి వరుసగా అధికారం చేపట్టిన మోడీ.. ఈసారి సామాన్యులకు, స్వచ్చులకు కేబినెట్ లో చోటు కల్పించారని ప్రచారం జరుగుతోంది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.. రెండోవైపు ఇంకో కోణం కూడా ఉంది. మోడీ కేబినెట్ లో చేరిన 57 మంది కేంద్ర మంత్రుల్లో క్రిమినల్ కేసులున్నావారు.. అత్యంత ధనవంతులైన కుబేర మంత్రులున్నారు..
మోడీ కేబినెట్ లో మొత్తం 57మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో దాదాపు 39శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదై ఉండడం విశేషం. ఈ లెక్కన 22 మంది మంత్రులపై కేసులున్నట్టు తేలింది. ఎన్నికల అఫిడవిట్ లో వారు దాఖలు చేసిన అఫిడవిట్లోనే వీటిని పొందుపరిచారు. ఇందులో 16మంది మంత్రులపై సీరియస్ క్రిమినల్ కేసులుండడం విశేషం. ఉగ్రవాదం, హత్య, అత్యాచారం, దోపిడీ, భూకబ్జా, మతకలహాలు సహా కిడ్నాప్ కేసులు కూడా వారిపై నమోదు కావడం గమనార్హం.
ఇందులో ప్రధానంగా ఒడిషా మోడీ అని పేరొందిన ప్రతాప చంద్రసారంగితో పాటు బాబూల్ సుప్రియో, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, అమిత్ షా, ప్రహ్లాద్ జోషిలపై ఈ కేసులు ఉండడం విశేషం. ఇక సీనియర్ మంత్రులు నితిన్ గడ్కరీ, గిరిరాజ్, అశ్విని కుమార్ చౌబే లు కూడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం విశేషం. మహారాష్ట్ర ఎంపీ మురళీధరన్ పై హత్యాయత్నం కేసు ఉంది. ఈయన విదేశీ వ్యవహారాల సహాయశాఖ చూస్తున్నారు.
ఇక ధనవంతులైన ఎంపీలు కూడా మోడీ కేబినెట్ లో ఉండడం విశేషం. దాదాపు 91శాతం మంది మంత్రులు కోటీశ్వరులు కావడం విశేషం. మొత్తం 57మంది మంత్రుల్లో 51 మంది మంత్రులు కోటీశ్వరులే.. ఇందులో హర్ సిమ్రత్ కౌర్ బాదల్ అత్యంత ధనవంతురాలైన కేంద్రమంత్రిగా మోడీ కేబినెట్ లో రికార్డు నమోదు చేశారు. ఆమె ఆస్తుల విలువ ఏకంగా 217కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్మ్స్ అనే సంస్థ వెల్లడించింది. పీయూష్ గోయల్ కేబినెట్ మంత్రుల్లో రెండో అత్యధిక ధనవంతుడిగా ఉన్నారు. ఈయన ఆస్తి 95 కోట్లుగా ఉంది. 42 కోట్లతో ఇందర్ జిత్ సింగ్ మూడో ధనవంతుడిగా ఉన్నారు. ఇక అత్యంత పేద కేంద్రమంత్రిగా ప్రతాప్ చంద్రసారంగి ఉన్నారు? ఈయన ఆస్తుల విలువ కేవలం 13లక్షలు కావడం విశేషం.
ఇక చదువుల విషయానికి వస్తే 14శాతం మంది మంత్రులు 12వ తరగతే చదవడం విశేషం. 87శాతం మంది మంత్రులు డిగ్రీ , అంతకంటే ఎక్కువ చదివారు.
ఇక 20శాతం మంది మంత్రుల వయసు 41 నుంచి 50 ఏళ్లుగా ఉంది. 80శాతం మంది వయస్సు 51 నుంచి 70 ఏళ్లుగా ఉంది. ఇలా ఈ లెక్కలన్నీ నేషనల్ ఎలక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థలు పేర్కొన్నాయి.