లోకేష్ నిరూపించుకునేది ఇంకెప్పుడు?
ఒక రోజు నాలుగు లక్షల ఉద్యోగాలు అంటాడు - మరో రోజు రెండు లక్షల ఉద్యోగాలు అంటాడు - ఇంకోసారేమో ఆల్రెడీ లక్ష ఉద్యోగాలు ఇచ్చేశాం.. అనేస్తాడు. ఈ ప్రహసనపు మాటలు పక్కన పెట్టి చూస్తే.. నారా లోకేష్ బాబు పరిస్థితి ఏమిటి? ఒట్టి మాటలు కట్టిపెడితే లోకేష్ బాబు నత్తింగ్ అని స్పష్టం అవుతోంది. ఇలాంటి మాటలు మాట్లాడితే కామెడీ అయిపోతుందని తెలిసి కూడా లోకేష్ అదే కామెడీనే కొనసాగిస్తున్నాడు. చంద్రబాబే అనుకుంటే.. ఇలాంటి మాటలతో లోకేష్ తన వంతు కామెడీని కొనసాగిస్తున్నాడు.
ఇక లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రి అనే గుర్తింపును ఇంకా సంపాదించుకోలేకపోతున్నాడు. ఏదో అనుకూల మీడియా ఉంది కాబట్టి.. లోకేష్ చెప్పే పోచికోలు కబుర్లు అన్నీ ప్రచురితం అవుతున్నాయి. ఏదో జరిగిపోతోందని జనాలకు భ్రమలు కల్పించే యత్నం చేస్తున్నారు. అయితే వాస్తవంగా చెప్పుకోవడానికి - రుజువుగా నిరూపించడానికి కనీసం ఒక్క ఐటీ కంపెనీ రాలేదు ఏపీకి.
అంత వరకూ ఎందుకు.. ఎక్కడైనా లోకేష్ బాబు ఒక్క ఐటీ సెమినార్ కు హాజరయ్యాడా? ఏదైనా సెమినార్ నిర్వహించి.. వాగ్ధాటిని ప్రదర్శించి - కంపెనీల్లో నమ్మకాన్ని కలిగించి.. వాటిని ఏపీ బాట పట్టించడానికి కనీసం ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయా? ఏదైనా వీడియో రూపంలో అయినా అందుకు రుజువు దొరుకుతోందా? అవతల తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు - తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ప్రసంగాలతో మెస్మరైజ్ చేస్తున్నాడు. సెమినార్లలో కేటీఆర్ ప్రసంగాలు అదిరిపోతున్నాయి. హైదారబాద్ ఇప్పటికే ఐటీకి కేంద్రంగా ఉంది. దానికి తోడు కేటీఆర్ వరస పెట్టి సెమినార్లతో సత్తా చూపిస్తున్నాడు.
ఇక లోకేష్ బాబు మాట్లాడితే తప్పులు దొర్లడం మాత్రమే అయిపోతోంది. ఆంధ్రప్రదేశ్ ను కంట్రీ అని, ఆంధ్రప్రదేశ్ ఒక కంపెనీ అని.. లోకేష్ బాబు తన వాగ్ధాటిని ప్రదర్శిస్తున్నాడు. తెలుగులోనే సరిగ్గా మాట్లాడటం రాని లోకేష్ బాబు ఇంగ్లిష్ లో మాట్లాడితే.. దారుణమైన తప్పులు దొర్లుతున్నాయి.
ఇలా సాగుతోంది ఏపీ ఐటీ శాఖా మంత్రి ప్రస్థానం. అవతల చంద్రబాబు ఏమో ఏకంగా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేసేద్దాం అనుకుంటున్నాడట. కుటుంబం ఒత్తిని భరించలేక.. తనయుడిని మంత్రిగా చేసి, ఇప్పుడు పై మెట్టుకు ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నాడట. మరి లోకేష్ నిరూపించుకునేదెప్పడు? ఆయన తీరేమో నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది కథ!