మీ వీపులు పగులుతాయి: నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగింది.. ప్రభుత్వం చేసే తప్పులపై పోరాడుతున్నాం’ అని నారా లోకేష్ నిప్పులు చెరిగారు.
ఏపీ నుంచి ఎక్కువగా గంజాయి వస్తుందని హైదరాబాద్ సీపీ చెప్పారు. డ్రగ్స్ పై పక్క రాష్ట్రం స్పందించారు. కానీ.. ఇక్కడి సీఎం స్పందించారా? గంజాయి నివారణలో రాష్ట్ర పోలీసులకు చిత్తశుద్ధి లేదు. నాలుగు అద్దాలు పగిలితే భయపడుతామని భావిస్తున్నారా? దాడులు చేసినంత మాత్రాన మేం భయపడం.. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి అని లోకేష్ హెచ్చరించారు.
టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన దుండగుల కార్లు డీజీపీ కార్యాలయం మీదుగానే వచ్చాయని నారా లోకేష్ అన్నారు. దాడి తర్వాత మళ్లీ అటువైపే వెళ్లాయి.. మఫ్టీలో ఉన్న పోలీసులను పంపించి దాడులు చేయించారని అన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును అనేక మాటలు అన్నారు. నడివిధీలో చంద్రబాబును కాల్చాలని జగన్ అన్నారా? లేదా? వైసీపీ నేతలు పోలీసులను అనేక తిట్లు తిట్టారు. అయినా వారిపై చర్యలు తీసుకోలేదు..బూతులకు కేరాఫ్ అడ్రస్.. వైసీపీ యూనివర్సిటీ మా అధినేతకు ఉన్న సహనం నాకు లేదు.. వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.
దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారని నారా లోకేష్ అన్నారు. మీకు సరైన శిక్ష పడే వరకూ మిమ్మల్ని వదిలిపెట్టమని లోకేష్ హెచ్చరించారు. రాష్ట్రంలో అత్యయిక పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు. కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.