ప్రధానిగా చంద్రబాబు.. యూట్యూబర్లకు భలే మంచి కంటెంట్!

నిజంగా సీఎం చంద్రబాబు పీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో లేవో కానీ తెలుగు డిజిటిల్ మీడియాలో ఈ అంశం చుట్టూనే రెండు రోజులుగా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది.;

Update: 2025-12-23 16:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ స్థానంలో 2026లో మరో నేత కనిపించనున్నారని, వచ్చే ఏడాది భారత రాజకీయాల్లో మార్పులు జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రెండు రోజుల క్రితం ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రసారం చేసిన కథనం ఆసక్తిరేపుతోంది. నిజంగా సీఎం చంద్రబాబు పీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో లేవో కానీ తెలుగు డిజిటిల్ మీడియాలో ఈ అంశం చుట్టూనే రెండు రోజులుగా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. కొందరు యూట్యూబర్లు, మరికొందరు పొలిటికల్ అనలిస్టులు తమ డిబేట్లకు ఇదే మెయిన్ టాపిక్ గా చేస్తూ రాయిటర్స్ కథనానికి మరింత మసాలా జోడిస్తున్నారు.

ఇప్పటికే రెండు సార్లు ఐదేళ్ల చొప్పన పీఎంగా పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మూడో టర్మ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన వయసు 75 ఏళ్లు దాటడం, బీజేపీ సిద్ధాంతాల ప్రకారం మోదీ ప్రధానిగా కొనసాగడం కరెక్టు కాదన్న వాదనతో 2026లో కొత్తవారు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని రాయిటర్స్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. మోదీ వారసులుగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ ప్రధాని అవ్వొచ్చని, ఒకవేళ వారు కాకుంటే ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కు కూడా ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయనే రాయిటర్స్ జర్నలిస్టుల విశ్లేషణ దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది.

హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవిస్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్ల విషయంలో ఎవరికీ అభ్యంతరం లేకపోయినప్పటికీ, మంత్రి లోకేశ్ పేరును పీఎం అభ్యర్థిగా పరిశీలిస్తున్నారని రాయిటర్స్ వ్యాఖ్యానించడంతో ఆ కథనం తేలిపోయింది. అయితే తెలుగు మీడియాలో మాత్రం చంద్రబాబు పీఎం అయ్యే ఛాన్సెన్స్ పైనే ఎక్కువగా డిబేట్ జరుగుతోంది. కొందరు సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ ఎనలిస్టులు సైతం ఇదే అంశంపై ప్రత్యేకంగా వీడియోలు చేశారు. తెలుగు మీడియాలో మెజార్టీ జర్నలిస్టులు చంద్రబాబు పీఎం అయ్యే అవకాశాలను తోసిపుచ్చుతున్నారు.

నిజానికి ప్రస్తుతం కేంద్రంలో మోదీ స్థానంలో మరొకరు ప్రధాని అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. అదే సమయంలో పీఎం బాధ్యతలు తీసుకోడానికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉండకపోవచ్చని అంటున్నారు. చంద్రబాబు తొలి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేందుకే మొగ్గు చూపుతారని అంటున్నారు. గతంలో ఒకటి రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా చంద్రబాబు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించిన చంద్రబాబు.. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలోనూ ఎక్కువ మంది ఎంపీల బలంతో బలమైన నేతగానే ఉన్నారు. బీజేపీ అంతర్గత వ్యవహారాల కారణంగా ప్రధాని మోదీ స్వచ్ఛందంగా తప్పుకున్నా, ఆయన స్థానంలో చంద్రబాబు వెళ్లే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపైనే చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ప్రధాని పదవి తీసుకోరని చెబుతున్నారు.

Tags:    

Similar News