నందికొట్కూరును నాకించేస్తున్నారే.. వైసీపీలో ర‌గ‌డ ర‌గ‌డ‌!

Update: 2020-12-20 11:50 GMT
క‌ర్నూలు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నందికొట్కూరులో వైసీపీ నేత‌ల మ‌ధ్య రోజుకో ర‌గ‌డ తెర‌మీదికి వ‌స్తోంది. అంతేకాదు.. నిత్యం వివాదాలు, విభేదాల‌తో సొంత పార్టీ నేత‌లు వ‌ర్గ పోరాటానికి తెర‌దీస్తున్నారు.దీంతో పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌కు మాత్రం న‌ర‌కం క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఇది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మే అయినా.. రెడ్డి సామాజిక వ‌ర్గం పెత్త‌నం ఆది నుంచి ఉంది. గ‌తంలో ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ కాక‌ముందు టీడీపీ త‌ర‌ఫున బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి మూడు సార్లు వ‌రుస విజ‌యాలు అందుకున్నారు. ఇక‌, అప్పుడు ప‌డిన రెడ్డి సామాజిక వ‌ర్గ పెత్తం అనే బీజం.. ఇప్పుడు వ‌ట‌వృక్షం మాదిరిగా ఎదిగింద‌నే టాక్ ఉంది.

గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ వైసీపీ విజ‌యం సాధించింది. గ‌త ఏడాది ఇక్క‌డ నుంచి ఆర్థ‌ర్ ఠాగూర్ విజ‌యం సాధించా రు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడి కుమారుడు సిద్ధార్థ‌రెడ్డి.. త‌ర్వాత కాలంలో వైసీపీలో చేరిపోయా రు. దీంతో ఆయ‌న దూకుడు పెంచారు. ఇక్క‌డ ఏం చేయాల‌న్నా.. ఎవ‌రితో మాట్లాడాల‌న్నా.. మొత్తం సిద్ధార్థ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే సాగుతోంది. అయితే.. ఎమ్మెల్యే క‌దా.. అంతా చూసుకోవాల్సింది.. అనే సందేహం వ‌స్తుంది. కానీ.. రెడ్డి సామాజిక వ‌ర్గం గ్రూపుగా ఏర్ప‌డి.. బైరెడ్డికి స‌హ‌క‌రిస్తోంది. ఎందుకంటే.. జ‌గ‌న్‌కు పార్టీలోని కీల‌క నేత‌ల‌కు సిద్ధార్థ‌కు మ‌ధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. దీంతో సిద్ధార్థ మాటే ఇక్క‌డ చెల్లుబాటు అవుతోంది.

అయితే.. ఇక్క‌డ మ‌రో సందేహం వ్య‌క్త‌మ‌వుతుంది. ఆర్థ‌ర్‌ను వైసీపీనేకదా ఎంపిక చేసింది. మ‌రి ఆయ‌న‌ను ఎలా త‌క్కువ చేస్తారు ? అని! ఇక్క‌డే ఉంది చిక్కంతా.. వైసీపీలో కీల‌క నేత‌ల‌కు ఆర్థ‌ర్‌కు మ‌ధ్య గ్యాప్ ఉంది. వారు అనుకున్న విధంగా ఈయ‌న వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. సో.. ఈయ‌న‌ను అంద‌రూ క‌లిసి ప‌క్క‌న పెట్టారు. దీంతో ఆర్థ‌ర్.. టీడీపీ నేత‌ల‌తో లోపాయికారీ.. స్నేహం పెంచుకుని ఓ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య అనేక విష‌యాల్లో నిత్య ర‌గ‌డ జ‌రుగుతూనే ఉంది. కొన్నాళ్ల కింద‌ట‌.. ఈ విష‌యం.. జ‌గ‌న్ దృష్టికి రావ‌డం.. ఆయ‌న ఇరు ప‌క్షాల‌కు స‌ర్ది చెప్ప‌డం జ‌రిగింది. అయినా ప‌రిస్థితి మాత్రం మార‌లేదు. వైసీపీ సీనియ‌ర్లు ఏమంటున్నారంటే.. ఆర్థ‌ర్ టీడీపీ నేత‌ల‌తో చేతులు క‌లిపి.. పార్టీని నాశ‌నం చేస్తున్నార‌ని!! దీంతో జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఇప్పుడు ఆర్థ‌ర్‌కు అప్పాయింట్‌మెంట్ లభించ‌డం లేదు. మొత్తంగా ఈ వివాదం చిలికి చిలికి గాలివాన‌గా మారి.. టీడీపీ పుంజుకునే ప‌రిస్తితి వ‌చ్చింది. మ‌రి వైసీపీ ప‌రిస్థితి ఏమ‌వుతుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News