'నాయిని' ఆరోగ్య పరిస్థితి విషమం !

Update: 2020-10-05 07:00 GMT
కరోనా ..కరోనా ..కరోనా .. ఈ మహమ్మారి పీడ కరోనాను ఆర్టికట్టే సరైన వ్యాక్సిన్ వచ్చేవరకు వదిలిపోయేటట్టు లేదు. రోజురోజుకి కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరగడానికి ముఖ్యకారణం వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడమే అని తెలుస్తుంది.   సామాన్యుల నుండి విఐపిలు , రాజకీయ నేతలు , ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు  ఈ కరోనా మహమ్మారి భారిన పడుతున్నారు. ఎమ్మెల్యే లు , ఎంపీలు మంత్రులు , ముఖ్యమంత్రులు కూడా కరోనా భారిన పడ్డారు.

ఇకపోతే , తెలంగాణలో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనా భారిన పడి కోలుకున్నారు. తాజాగా  తెలంగాణ మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహా రెడ్డికి  గత వారం కరోనా పాజిటివ్ గా తేలింది.  అయనకి కరోనా పాజిటివ్ అని తెలియగానే  హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో  ఈ మధ్యకాలంలో తనను కలిసివారంతా కరోనా టెస్ట్‌ లు చేయించుకోవాలని, హోంక్వారంటైన్లో కి వెళ్లాలని సూచించారు.  అయితే, ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్టు , అయన కండిషన్ సీరియస్ గా ఉండడంతో ఆయన చికిత్స పొందుతోన్న ఆస్పత్రిలోనే ఇంటెన్సివ్ కేర్‌ కు తరలించినట్టు ప్రసారమాధ్యమాలల్లో ఓ వార్త ప్రచారం అవుతుంది. దీనితో అయన ఆరోగ్య పరిస్థితి పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
Tags:    

Similar News