• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నాగబాబు వర్సెస్ రోజా.....

నాగబాబు వర్సెస్ రోజా.. వైసీపీ, జనసేన ఫైట్ గా మారిందా?

By - Tupaki Desk
Update: 2020-02-01 05:06 GMT
ఇన్నాళ్లు వారిద్దరి రాజకీయం వేరు.. సినిమాఇజం మాత్రమే ఒకటిగా ఉండేది. కలిసి షోలు చేసేవారు.. కలిసి నవ్వుకునేవారు.. జనాల్లోకి వెళితే మాత్రం ఎవరి పార్టీ తరుఫున వారు తిట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఇద్దరూ విడిపోయారు. జనసేన తరుఫున నాగబాబు, వైసీపీ తరుఫున ఎమ్మెల్యే రోజాల మధ్య ఫైట్ ఆసక్తి రేపుతోంది.

ఇన్నాళ్లు జబర్ధస్త్ షోతో ఈ ఇద్దరు బుల్లితెరపై నవ్వులు పంచుకున్నారు. కానీ నాగబాబు విడిపోయి జబర్ధస్త్ కు పోటీగా వేరు కుంపటి పెట్టి ‘అదిరింది’తో పోటీనిస్తున్నారు. దీంతో ఇద్దరి పార్టీలు వేరైనా ఇన్నాళ్లు విమర్శలకు పోని ఇద్దరి మధ్య ఫైట్ తాజాగా ముదిరింది. ఇప్పుడు బుల్లితెర సాక్షిగా నాగబాబు వర్సెస్ రోజా యుద్ధం మొదలైందన్న చర్చ సాగుతోంది. రేటింగ్ ల కోసం వీరిద్దరూ తమ ప్రోగ్రాంలతో ఢీ అంటే డీ అంటుండడం విశేషంగా మారింది. ఈ వార్ ఇప్పుడు రాజకీయం గానూ సెగలు కక్కుతోంది.

నాగబాబు విడిపోయి జీతెలుగులో జబర్ధస్త్ కు పోటీగా అదిరింది షో మొదలుపెట్టారు. అందులో జబర్ధస్త్ పై కౌంటర్లు ఇస్తూ ప్రోగ్రామ్స్ చేయడంపై జబర్ధస్త్ టీం కూడా ప్రతీగా రియాక్ట్ అవుతోంది. రెండు షోలు రేటింగ్ ల కోసం చిన్న పాటి యుద్ధమే చేసుకుంటున్నాయి.

సోషల్ మీడియా లోనూ జనసేన ఫ్యాన్స్ నాగబాబు ‘అదిరింది’కి సపోర్టు గా పోస్టులు పెడుతుంటే.. వైసీపీ ఫ్యాన్స్ రోజా ‘జబర్ధస్త్’ను పొగిడేస్తున్నారు. ఇది కాస్తా వైసీపీ వర్సెస్ జనసేనగా మారుతోంది. నంబర్ 1 షో మాదేనంటూ మాదేనని రెండు పార్టీల ఫ్యాన్స్ ప్రచారం చేసుకుంటున్నారు. షోల హైప్ కోసం కూడా నాగబాబు, రోజా షోలను జనసేన, వైసీపీ మధ్య ఫైట్ గా చిత్రీకరించేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇలా నవ్వుల యుద్ధం కాస్తా రాజకీయ ఫైట్ గా మారిపోవడం విచిత్రమే మరీ..
Tags:    
  • Naga Babu Vs Roja 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Adirindhi Show 
  • Jabardasth Show 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS