ఇతడో రేర్ పీస్.. ఇలాంటోడ్ని మీరెక్కడా చూసి ఉండరు

Update: 2021-03-17 13:30 GMT
రేర్ పీస్ అన్న మాట చాలాసార్లు విని ఉంటారు. కానీ.. ఇతడి గురించి తెలిస్తే మాత్రం.. ఇతని కంటే రేర్ పీస్ మరెవరూ ఉండరన్న భావన కలగటం ఖాయం. అమెరికాకు చెందిన 22 ఏళ్ల జిమ్మీ డొనాల్డ్ సన్ రోటీన్ కు పూర్తిగా భిన్నమైనోడు. డబ్బుల్ని ఎవరైనా పొదుపు చేసి.. పెట్టుబడి పెట్టి మరింత సంపాదిస్తారు.ఇతను.. అందుకు భిన్నంగా డబ్బుల్ని విపరీతంగా ఖర్చు చేసి.. మరింత సంపాదిస్తుంటాడు. డబ్బును నీళ్ల కంటే సింఫుల్ గా ఖర్చు చేయటం ఇతనికి మాత్రమే సాధ్యం. ఇతగాడి యూట్యూబ్ ల్ని చూస్తే.. మన జీవితంలోనూ ఏదో ఒక పాయింట్ లో ఇతగాడు కనిపిస్తే బాగుండనుకోవటం ఖాయం. ఇంతకూ ఇతగాడు ఏం చేస్తుంటాడంటారా? అక్కడికే వస్తున్నాం.

యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేయటం జిమ్మీకి అలవాటు. అలా అని ఊరికే ఇవ్వడు. ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అయితే.. అతగాడు అడిగేది మీరు కలలో కూడా ఊహించలేనిదే ఉంటుంది.  చేసే పనికి ఏ మాత్రం సంబంధం లేకుండా.. భారీ మొత్తాల్ని సింఫుల్ గా ఇచ్చేయటం ఇతనికి అలవాటు. ఆ మధ్యన అతడో రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ పని చేసే యువతిని పిలిచి.. ఆమెను ఉద్యోగం మానేస్తావా? అని అడిగాడు. అర్థం కాని ఆమె అయోమయంగా అతడి వంక చూస్తే.. నువ్వు చేస్తున్న ఉద్యోగం మానేస్తే.. రూ.73లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. మొదట నమ్మలేదు. కానీ.. అతడు సీరియస్ గా క్యాష్ చేతిలో పెట్టేందుకు సిద్ధం కావటంతో.. ఉద్యోగం మానేసింది.

మరో సందర్భంలో వాల్ మార్ట్ లో పని చేసే ఒక చిన్న ఉద్యోగికి జాబ్ మానేస్తే రూ.7.25లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. మరో సందర్భంలో ఒక పెద్ద భవంతి తాళం చెవిని.. చాలా తాళం చెవుల్లో కలిపి.. సరైన దానితో తాళం తెరిస్తే.. ఇంటిని ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేశాడు. ఒకసారి కారుకు పంక్చర్ అయితే.. సాయం చేసిన వ్యక్తికి కారును బహుమతిగా ఇచ్చేశాడు. ఇలా ఇచ్చుకుంటూ పోతే ఎన్ని డబ్బులు కావాలి? అతనిక సంపాదన ఏమిటంటారా? ఇలా ఊహించినంత భారీ బహుమతులు ఇవ్వటమే అతని ఆదాయమార్గం.

అర్థం కాలేదా? అదేనండి.. ఇలా టాస్కులు ఇచ్చి జనాల్ని ఎగ్జైట్ చేయటం.. అతను యూ ట్యూబ్ లో పోస్టు చేసే వీడియోల్ని కోట్లాది మంది చూడటం ద్వారా అతను రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తాను సంపాదించే మొత్తాన్ని తిరిగి మళ్లీ సంపాదన కోసం పెట్టుబడి పెడుతున్నాడు. ఇంతకీ ఇతని యూట్యూబ్ చానల్ కు ఉన్న సబ్ స్కైయర్లు ఎంత మంది ఉన్నారో తెలుసా? అక్షరాల 5.53 కోట్ల మంది. అతని యూట్యూబ్ చానల్ పేరు మిస్టర్ బీస్ట్. ఇతను పోస్టు చేసే వీడియోను.. ఒక హిట్ సినిమాను చూసే వారి కంటే ఎక్కువమంది చూస్తారని చెబుతారు. ఈ కారణంగా యూట్యూబ్ నుంచి వచ్చే భారీ మొత్తంతో ఇతను ఖరీదైన బహుమతులు ఇస్తుంటాడు. ఇప్పుడు చెప్పండి.. ఇతను మీ జీవితంలో ఏదో ఒక టైంలో ఎదురుపడి.. టాస్కు ఇచ్చేస్తే బాగుండని అనుకుంటారు కదూ?Full View
Tags:    

Similar News