• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వారి రాజీనామాలు కారులో...

వారి రాజీనామాలు కారులో కుదుపేనా....!?

By - Tupaki Desk
Update: 2019-02-02 11:57 GMT
వారిద్దరు ఆ పార్టీకి రెండు చక్రాల వంటి వారు. వారిద్దరు ఆ పార్టీకి క్లచ్‌... ఎక్స్‌ లేటర్ వంటి వారు... వారిద్దరు పార్టీకి ఏ పరిస్ధితులలోనైన ట్రబుల్ షూటర్లు. అంతేకాదు ఒకరు పార్టీ అధ్యక్షుడి సొంత కుమార్తే అయితే మరోకరు మేనల్లుడు. వారే ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చకు కేంద్రబిందువులయ్యారు. వారేవరో ఈ పాటికే మీకు అర్దం అయి ఉంటుంది.  అవును... వారే తన్నీరు హరీష్‌ రావు - కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం ప్రారంభమయినప్పటి నుంచి విజయం సాధించి రెండు సార్లు అధికారంలోకి రావడానికి ఈ ఇద్దరి పాత్ర ఎంతో ఉంది. పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కల్వకుంట్ల కవిత స్వయాన కుమార్తే. తెలంగాణ జాగ్రుతి సంస్దను స్థాపించి తెలంగాణ ఉద్యామాన్ని మహిళలలోకి చొచ్చుకుపోయేల చేసారు ఆమె. 2014 ఎన్నికలలో నిజామాబాద్‌ నుంచి ఎన్నికై లోక్‌ సభలో అడుగుపెట్టారు. సింగరేణి కార్మిక సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్నారు.

ఇక తన్నీరు హరీష్‌ రావు కేసీఆర్‌ కు స్వయాన మేనల్లుడు.2014 క్యాబినెట్‌ లో మంత్రిగా పనిచేసారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.అయితే హఠాత్తుగా ఏమైందో తెలియదుగాని ఈ ఇద్దరు తమ పదవులకు రాజీనామ చేసారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య అధ్యక్ష పదివికి హారీష్‌రావు తన రాజీనామ లేఖను సమర్పించారు. ఈ అనూహ్య నిర్ణయానికి పార్టీలో అందరూ ఆశ్చర్యాని వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణం ఏమై ఉంటుందా అని తర్జనబర్జనలు పడుతున్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ కవిత సింగరేణి కార్మిక సమాఖ్య పదవి - మిగిలిన సంస్దల పదవులకు శనివారం నాడు రాజీనామ చేసారు. త్వరలో జరగనున్న లోక్‌ సభ ఎన్నికలలో ఈ పదవులు అడ్డు రాకుడదనే రాజీనామ చేస్తున్నట్లు చెబుతున్నారు. పైకి ఈ కారణాలు చెబుతున్న ఇద్దరు పెద్ద నాయకులు పలు పదవులకు రాజీనామ చేయడంపై తెలంగాణ రాష్ట్ర సమితిలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ రాజీనామాలు దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.


Tags:    
  • MP Kavitha 
  • Honorary President 
  • Various Committees 

Similar News

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

Copyright @2026

Powered by Blink CMS