• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మాజీ బాస్ పై ఫస్ట్రేషన్...

మాజీ బాస్ పై ఫస్ట్రేషన్ తీర్చేసుకున్న బాబు మోహన్

By - Tupaki Desk
Update: 2019-08-19 07:35 GMT
వందమంది జాబితాను ప్రదర్శిస్తూ.. అందులో ఇద్దరు సిట్టింగులకు సీట్లు ఇవ్వకుంటే.. అంతకు మించిన అవమానం ఇంకేం ఉంటుంది? ఇవ్వకపోతే.. ఇవ్వకపోయారు.. ఇవ్వనన్న విషయాన్ని చెప్పటమో.. లేదంటే మరో పదవి ఇస్తేనో సరిపోయే దానికి భిన్నంగా ప్రముఖ నటుడు కమ్ రాజకీయనేత బాబు మోహన్ విషయంలో టీఆర్ ఎస్ బాస్ అనుసరించిన పద్దతిపై చాలామందిలో గుర్రు ఉంది. ఎంతమంది పని చేయని నేతలకు.. ఫీల్డ్ లో నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారికో టికెట్లు ఇచ్చేసిన కేసీఆర్.. తనకు మాత్రం టికెట్ ఇవ్వకుండా దారుణంగా అవమానించినట్లుగా ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు బాబు మోహన్.

నిజమే.. ఆయన బాధలోనూ అర్థం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. టీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చేసి బీజేపీలో చేరిన ఆయన.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు ఫోకస్ పెట్టాలని నడ్డా ఆదేశించిన నేపథ్యంలో.. మరింతగా శ్రమిస్తున్నారు.

ఇలాంటి వేళ.. మీడియాతో మాట్లాడిన బాబు మోహన్.. తన ఫస్ట్రేషన్ ను బయటపెట్టేశారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం ఉందో లేదన్న విషయం  కొంతకాలం ఆగితే తెలుస్తుందని.. కూల్చటం తప్పించి కేసీఆర్ కు మరేం తెలీదని మండిపడ్డారు. రాజకీయాల్లో అవుట్ డేటెడ్ అంటూ ఉండదని.. అంతదాకా ఎందుకు?  రేపొద్దున కేసీఆర్.. కేటీఆర్ లు ఓడిపోతే అవుట్ డేటెట్ అయిపోయినట్లా? అంటూ ప్రశ్నించారు. పాలన చేతకాకే బీజేపీని టీఆర్ ఎస్ నేతలు విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. మొత్తానికి బాబు మోహన్ జోరు చూస్తుంటే.. తనకు ఎదురైన అవమానానికి బదులు తీర్చుకునే వరకూ నిద్రపోనట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.  

    

Tags:    
  • Babu Mohan 
  • KCR 
  • Latest News 
  • Telugu news 

Similar News

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

Copyright @2026

Powered by Blink CMS