ప్రపంచ అతిపెద్ద సొరంగమార్గం ప్రారంభించిన మోడీ..ప్రత్యేకతలివే!
ప్రపంచం లోనే అతి భారీ పెద్దదైన సొరంగ మార్గాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తంగ్ వద్ద నిర్మించిన ఈ వ్యూహాత్మక సొరంగం వల్ల మనాలి, లేహ్ మధ్య 475 కిలోమీటర్ల దూరం 46 కిలోమీటర్లకు తగ్గుతుంది. దీని వల్ల దాదాపు నాలుగున్నర గంటల సమయం ఆదా అవుతుంది. మొత్తం 9.02 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీనిని నిర్మించారు.
ఈ సొరంగంలో 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మాణం సాగింది. ఇందులో రోజుకి 3,000 కార్లు, 1,500 ట్రక్కులు ప్రయాణించేందుకు అవకాశం ఉంది. అలాగే, అత్యవసర సమయంలో సమాచారం ఇవ్వడానికి ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రతి 60 మీటర్లకు అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థ, ప్రతి 250 మీటర్లకు ఆటో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టం సీసీటీవీ కెమెరాలు, కిలోమీటరుకు గాలి నాణ్యతను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి. టన్నెల్‌లో వెలుతురు కోసం సెమీ ట్రాన్స్‌ఫర్ వెంటిలేషన్ సిస్టం ఉంది. మొత్తం రూ.3,500 కోట్లు ఖర్చు చేసారు.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది మే నెలలో ఇది ప్రారంభంకావాల్సి ఉన్నా లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైంది. ఇక, వాజ్‌పేయి హయాంలోనే 2000 జూన్ 3న ఈ సొరంగ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత 2002 మే 26న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, ఆరేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటికి ఇది అందుబాటులోకి వచ్చింది. ఏడాది పొడవునా మనాలీని లాహౌల్-స్పితి లోయతో మంచు కప్పి ఉంచుంది. శీతకాలంలో లాహౌల్-స్పితి వ్యాలీలోని ఇతర ప్రాంతాలకు ఆరు నెలలపాటు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. ఈ మార్గం నిర్మాణంతో ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా రాకపోకలు సాగనున్నాయి. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు.
దక్షిణ ముఖద్వారం మనాలీకి 25 కి.మీ. దూరాన సముద్ర మట్టానికి 3,060 మీటర్ల ఎత్తులోనూ, ఉత్తర ద్వారం లాహౌల్ లోని తేలింగ్ సిస్సు గ్రామ సమీపంలో సముద్ర మట్టానికి 3,071 మీటర్ల ఎత్తులో ఉంది. గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఈ సొరంగం మార్గం వెడల్పు 10.5 మీటర్లు. ఇందులో 8 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మించారు. అంటే సింగిల్ ట్యూబ్‌లో రెండు లైన్ల రోడ్లను నిర్మించారు.