త‌ల్లిని బెదిరించి మైనర్ కూతుళ్ల‌పై అత్యాచారం.. ఆపై పురుగుల మందుతో ..!

Update: 2021-08-11 08:10 GMT
రోజురోజుకు దేశంలో అత్యాచార ఘటనలు కుప్పలుతెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి. మానవ రూపంలో ప‌శువుల వికృత క్రీడ‌లు ఆడుతున్నారు. ఎన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగినా నరరూప రాక్షసులు అసలు మార‌డం లేదు. ఆడ పిల్ల‌ల జీవితాల‌తో ఆడుకుంటూ వారి పాలిట మృత్యుదేవుళ్లలుగా మారుతున్నారు. ముక్కుప‌చ్చ‌లు ఆర‌ని ప‌సి పాప‌ల నుంచి ముస‌లి వాళ్ల వ‌రకు ఎవ‌రిని వ‌ద‌ల‌డం లేదు ఈ కామాందులు. ఒళ్లు మ‌రిచి స్త్రీ జాతికి పెనుముప్పుగా మారుతున్నారు.

తాజాగా హర్యానా రాష్ట్రం సోనిపట్ పరిధిలోని ఓ గ్రామంలో దారుణం జ‌రిగింది. తల్లిని బెదిరించి ఇద్దరు మైనర్ బాలిక పై నలుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. ఆ త‌రువాత వాళ్ల‌తో పురుగుల మందు బలవంతంగా తాగించి బలవన్మరణానికి ప్రోత్సహించారు. ఈ సంఘ‌ట‌నకు సంబంధించి కుండ్లీ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం 22 నుంచి 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న న‌లుగురు నిందితులు ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. వాళ్లు ఇత‌ర ప్రాంతం నుంచి వ‌ల‌స వ‌చ్చి కార్మికులుగా జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. వారి ఇంటి ప‌క్క‌నే మైన‌ర్ బాలిక‌లు త‌మ త‌ల్లితో క‌లిసి అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 5, 6 తేదీన అర్థ‌ రాత్రి ఈ న‌లుగురు నిందితులు బలవంతంగా బాలికల ఇంట్లోకి వెళ్లి వారి తల్లిని బెదిరించి మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తరువాత వారిచే పురుగుల మందు తాగించారు. అయితే, బాలికల పరిస్థితి విషమించడంతో.. తమ కుమార్తెలను పాము కరిచినట్లు పోలీసులకు చెప్పాలని తల్లిని బెదిరించారు నలుగురు నిందితులు. బాలికలను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రాణభయంతో బాలికల తల్లి, తమ పిల్లలను పాము కాటు వేసిందని ఆస్పత్రి సిబ్బందికి తెలియజేసింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి, గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషం తీసుకోలేదని , ఆ కామాంధులు అత్యాచారం చేసి బలవంతంగా విషం నోట్లో పోశారని చెప్పింది. ఇక పోస్ట్‌ మార్టం నివేదికలో లైంగిక వేధింపులు, విషప్రయోగం జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని ఎస్‌ హెచ్ ఓ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.


Tags:    

Similar News