కిడ్నాప్ నాటకం.. కన్నతండ్రికే దమ్కీ ఇచ్చి మైనర్
సినిమాల ప్రభావం చిన్నపిల్లల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుందో అనడానికి ఇదో ఉదాహరణ.. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడు తనను ఎవరో కిడ్నాప్ చేసినట్టు డ్రామా ఆడి కన్నతండ్రికే దమ్కీ ఇచ్చాడు. రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి కేసును ఛేదించారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి కుమారుడు (16) నవంబర్ 6 న ఇంట్లో నుంచి బైక్ తీసుకొని బయటకు వెళ్లాడు. అనంతరం బైక్ ను మెట్రో స్టేషన్ లో పార్క్ చేసి బస్సులో తిరుపతి కి వెళ్లాడు. తిరుపతి లాడ్జ్ లో ఓ గదిని అద్దెకు తీసుకొని కిడ్నాప్ డ్రామా నడిపించాడు. తర్వాత ఎవరో కిడ్నాప్ చేసినట్టు సీన్ క్రియేట్ చేశాడు.
తండ్రి వాట్సాప్కు ఫొటోలు పంపించి డ్రామా ఆడాడు. రూ. 5 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామంటూ మెసేజ్లు పెట్టాడు. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదుతో కథ అడ్డం తిరిగింది. వాట్సాప్ నంబర్ ఆధారంగా పోలీసులు లోకేషన్ ను గుర్తించారు. తిరుపతిలోని ఓ లాడ్జి లో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తనను చదువుకోవాలని పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నారని.. తనకు ఆసక్తి లేదని బాలుడు పోలీసులకు తెలిపాడు. కన్నడ మూవీలోని 'అలమేలమ్మా ' ఆపరేషన్ సీన్ ఆధారంగా కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు పోలీసులు చెప్పాడు. పిల్లల కదలికల పై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని.. చదువులు, ర్యాంకుల కోసం వారి పై ఒత్తడి తేవొద్దని పోలీసులు సూచిస్తున్నారు.