ప్రకాష్‌రాజ్‌ను చంపండి.. నేను జైలుకు వెళ్తా!: బీజేపీ నేత నోటి దూల
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. శ్రీరాముడు-లక్ష్మణుడు దక్షిణాదికి వలస వచ్చారని.. వారు పండ్లు దొంగతనం చేశారని.. వ్యాఖ్యానించారు.;
తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు, రంగారెడ్డి జిల్లా పట్టణ కమలం పార్టీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి.. బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్‌ను చంపాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే. ఆయనను ఎవరు చంపినా.. తానే ఏ-1గా పోలీసులకు లొంగిపోయి.. జైలుకు వెళ్తానని అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారానికి దారి తీశాయి. బీజేపీ నాయకులు కూడా వీటిని తప్పుబట్టారు.
ఏం జరిగింది?
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. శ్రీరాముడు-లక్ష్మణుడు దక్షిణాదికి వలస వచ్చారని.. వారు పండ్లు దొంగతనం చేశారని.. వ్యాఖ్యానించారు. ఇంకా ఏవేవో అన్నారు. దీనిపై రాష్ట్రంలోనే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ సెగ రగిలింది. సాక్షాత్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించి.. ప్రకాష్‌రాజ్ హిందువులను అవమానించారని.. క్షమాపణలు చెప్పాలని కోరారు. ఇక, బండి సంజయ్ కూడా ఈ విషయంపై స్పందించారు.
అయితే..ఈ విషయంలో జోక్యం చేసుకున్న వనిపల్లి శ్రీనివాస్.. ప్రకాష్‌రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ``ప్రకాష్ రాజ్‌ను ఎవరైనా హత్య చేస్తే, ఆ కేసులో నేనే ఏ-1 గా ఉంటా. పూర్తి బాధ్యత వహిస్తా. జైలుకు కూడా వెళ్తా`` అని సంచలన ప్రకటన చేశారు. తాను నస్తికుడినని పలు సందర్భాల్లో చెప్పుకొన్న ప్రకాష్ రాజ్.. రాముడిపై ఎందుకు నోరు చేసుకున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రకాష్‌రాజు విషయాన్ని తాము వదిలేది లేదని హెచ్చరించారు.
అంతేకాదు.. ప్రకాష్‌రాజ్ పై నిరసన కార్యక్రమాలకు కూడా శ్రీనివాస్‌రెడ్డి తెరదీశారు.
1) ప్రకాష్ రాజ్ షూటింగ్ ఎక్కడ జరిగినా అడ్డుకుంటామని చెప్పారు.
2) టూర్ డైరీని ఫాలో అవుతామన్నారు.
3) హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే వెంటాడి, వేటాడతామన్నారు.