సుప్రీంలో మంత్రి కొప్పుల ఎదురుదెబ్బ.. ఇప్పుడేమైందంటే?

Update: 2022-08-18 04:36 GMT
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉదంతంలో తగిలిన షాక్ ఆయన్నువార్తల్లోకి వచ్చేలా చేసింది.

ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టేసిన వైనం ఆయనకు షాకింగ్ గా మారుతుందని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగటం తెలిసిందే.

అయితే.. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లుగా మంత్రి కొప్పుల మీద ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశాన్ని తీసుుకొని.. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో.. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి ఈశ్వర్ సుప్రీంను కోరారు.

దీంతో.. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మంత్రి కొప్పుల ఈశ్వర్ పిటిషన్ ను కొట్టేస్తూ తాజాగా నిర్ణయాన్ని ప్రకటించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వర్గాల వాదనల్ని విన్న సుప్రీంకోర్టు..

పిటిషన్ విచారణను నిలిపేయాలన్న వినతిని కొట్టేసిన వైనం ఆయనకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందన్న మాట వినిపిస్తోంది. మరి.. సదరు పిటిషన్ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఎలాంటి ఆదేశాల్ని జారీ చేస్తుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News